సంక్రాంతి సంబరం
సంక్రాంతి సంబరం.. అంటింది అంబరం
నెల ముందే నెల గంటు..నెలకుంది ఉత్సాహం .
మొదలైన తంట ..భోగి కోసం అంట
కంపెనీ ముళ్ళు.. కర్ర ముక్కలు ..
కారు పిడకలు ..బుట్టలు.. తట్టలు
సమిధ కోసం సిద్దం అయినాయి అన్నీ
భోగి పిడకల దండ .. పొడవుగా నుండ
నాదొక దండ ..చెల్లిదొక దండ..అక్క చెంత నుండ
నిద్ర లేని నిశి రాత్రి.. .భోగి మంట చలి రాత్రి
భోగి మంట కోసం ..బరితెగింపులెన్నో ..
బండి కర్ర కోసం ..బడితె పూజలేన్నో
ముసలవ్వ కళ్ళు కప్పి ..చావడిలో చాపలు
ముదనస్టపు తిట్లన్నీ ముత్యాల మూటలు
ముందుకు సాగుతున్న మహా మహా యజ్ఞం .
చిటపట సవ్వడితో చిర్రెత్తిన మంటలు
చలి మంట దుప్పటి కోసం చుట్టూ చేరిన జనం .
మరునాడే సంక్రాంతి సంబరం ..
అరిసెలు ..అప్పాలు ..పాయసం.
పెద్దలకు ప్రేమైక నీరాజనం ..
జంగమయ్య పొగడ్తలు..పంతులు గారి పూజలు
డూడూ బసవన్నలు ..హరిదాసు గెంతులు .
కుర్ర కారు ఊసులు ఆడపిల్లల ఆటలు ..
వయ్యారి భామలు ..ఓర చూపు విసుర్లు
వంటింటి వాసనలు.వాకిటలో ముగ్గులు
గొబ్బెమ్మల గుభాళింపు ..తొక్కితే తిట్లు ..
రంగవళ్ళుల ..రమణీయాలు ..
రయ్యమన్న గాలి పటాలు
పుట్టింట పూర్ణమ్మలు .పండుగ అల్లుళ్ళు
పేకాట పాపన్నలు ..పొరుగూరి తిరునాళ్ళు
కోడి దూడ రంకెలు.. కోడి పందెం ఆటలు
సంక్రాంతి సంబరం తెలిగింట అంబరం
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
సంక్రాంతి సంబరం.. అంటింది అంబరం
నెల ముందే నెల గంటు..నెలకుంది ఉత్సాహం .
మొదలైన తంట ..భోగి కోసం అంట
కంపెనీ ముళ్ళు.. కర్ర ముక్కలు ..
కారు పిడకలు ..బుట్టలు.. తట్టలు
సమిధ కోసం సిద్దం అయినాయి అన్నీ
భోగి పిడకల దండ .. పొడవుగా నుండ
నాదొక దండ ..చెల్లిదొక దండ..అక్క చెంత నుండ
నిద్ర లేని నిశి రాత్రి.. .భోగి మంట చలి రాత్రి
భోగి మంట కోసం ..బరితెగింపులెన్నో ..
బండి కర్ర కోసం ..బడితె పూజలేన్నో
ముసలవ్వ కళ్ళు కప్పి ..చావడిలో చాపలు
ముదనస్టపు తిట్లన్నీ ముత్యాల మూటలు
ముందుకు సాగుతున్న మహా మహా యజ్ఞం .
చిటపట సవ్వడితో చిర్రెత్తిన మంటలు
చలి మంట దుప్పటి కోసం చుట్టూ చేరిన జనం .
మరునాడే సంక్రాంతి సంబరం ..
అరిసెలు ..అప్పాలు ..పాయసం.
పెద్దలకు ప్రేమైక నీరాజనం ..
జంగమయ్య పొగడ్తలు..పంతులు గారి పూజలు
డూడూ బసవన్నలు ..హరిదాసు గెంతులు .
కుర్ర కారు ఊసులు ఆడపిల్లల ఆటలు ..
వయ్యారి భామలు ..ఓర చూపు విసుర్లు
వంటింటి వాసనలు.వాకిటలో ముగ్గులు
గొబ్బెమ్మల గుభాళింపు ..తొక్కితే తిట్లు ..
రంగవళ్ళుల ..రమణీయాలు ..
రయ్యమన్న గాలి పటాలు
పుట్టింట పూర్ణమ్మలు .పండుగ అల్లుళ్ళు
పేకాట పాపన్నలు ..పొరుగూరి తిరునాళ్ళు
కోడి దూడ రంకెలు.. కోడి పందెం ఆటలు
సంక్రాంతి సంబరం తెలిగింట అంబరం
మన తెలుగు మన సంస్కృతి
No comments:
Post a Comment