Pages

Friday 26 October 2012

మన స్నేహం

స్వచ్చమైన ముత్యం వంటిది
ఉదయించిన సూర్యుడు వంటిది
వికసించిన పుష్పం వంటిది
నిశ్చల సరస్సు వంటింది
చిగురించిన పత్రము వంటిది
పువ్వు లోని మకరందము వంటిది
అంతరాలు లేనిది
అరిమరికలు  లేనిది
అపర్దాలు తెలియనిది
అంతస్తులు చూడనిది
ఈ సృష్టిలో ఒకటుంది 
అదే తియ్యని మన స్నేహం  
 
                                        నీలారవిందం 
 
 
                                

సబ్ కా మాలిక్ ఏక్ హై

                                                     సబ్ కా మాలిక్ ఏక్ హై
అనేక మతాలూ వేద వేదాంగాలు చదివినా కూడా కానరాని ఆత్మసాక్షాత్కారం  ఒక్క సద్గురువు వలన నీకు ప్రాప్తించి నిన్ను భగవంతునికి దగ్గర చేస్తుంది.  షిర్డీ సాయి, సత్య సాయి ,గురునానక్ ,ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త , గౌతమ్ బుద్దుడు , మహా  వీరుడు ఇలా అనేకమంది సద్గురువులు మనిషిని తమ బోదనల ద్వారా ప్రభావితం చేసారు . త్రేతా యుగంలో అయితే శ్రీరాముడు ద్వాపరంలో శ్రీకృష్ణుడు  వీరందరూ భగవంతిని అంశతో  అవతరించారు ఒక్కొక్క అవతారానికి ఒక్కో కారణం . అందుకే ఏ దేవున్ని చూసినా యోగముద్రలో వున్నట్టు మనకు కనిపిస్తుంది . ఏ  గురువు కూడా నేనే భగవంతున్ని అని చెప్పలేదు , రాముడు శివున్ని పూజించాడు  , యేసుక్రీస్తు కూడా  నేను దేవుని కుమారున్నే అంటాడు . "ఎప్పుడైతే దర్మానికి కీడు వాటిల్లి అధర్మం ప్రబలుతుందో ఆయా కాలాల్లో అవతరిస్తాను" అని గీతలో భగవానుడు శ్రీకృష్ణుని రూపంలో అర్జునునికి  ఉపదేశించినట్లు  ప్రతి సద్గురువు పుట్టిన కాలమాన పరిస్తితులను గమనించినట్లైతే వారు అయాకాలల్లో ఉన్న సమస్యలను పరిస్కరించటానికే  అవతరించినట్టు మనకు కనపడుతుంది. ముఖ్యంగా  షిర్డీ సాయి ఆ రోజుల్లో మతకల్లోలలతో అట్టుడికి పోతున్న  హిందూ ముస్లింలలో  స్నేహ భావాన్ని పెంపోదించి , తద్వారా మానవతావాదాన్ని చాటి చెప్పారు , హిందువులు హిందుగా,  ముస్లింలు ముస్లిం గా సాయి నాదున్ని కొలుస్తారు . భగవంతుడు ఒక్కడే అని "సబ్ కా మాలిక్ ఏక్ హై" అని చాటి చెప్పారు . అంతే కాకుండా తన  భక్తులకు అనుక్షణం కనిపెట్టుకొని ఉండెడివారు. వారు తన వద్ద రాత్రి పూట అలసినిద్రిస్తున్న భక్తులకు ప్రతిగా  తన స్వహస్తాలతో  సేవ చేసేవారట . వారు  సర్వజ్ఞాని అయినా కూడా ఏమి తెలియనట్టే నటించేవారు వారు  భోగాలు  అనుభవించకుండా భిక్ష చేసుకొని  జీవించారు. దక్షనల  రూపంలో భక్తులు సమర్పించిన  వేలాది రూపాయిలను పేదలకు దానం చేసేవారు . వారు  తనువు  చాలించే నాటికీ బాబా దగ్గర  కేవలం ఏడు రూపాయిలు  మాత్రామే  వున్నాయట .

ఈ గురువులందరూ ఒకేసారి ఆకాశం నుండి ఊడి పడలేదు ఎంతో కఠిన  పరీక్షలను తట్టుకొని తమ తపో జ్ఞానంతో భగవంతున్ని ప్రసన్నం చేసుకొని సద్గురువులుగా ఖ్యాతి పొందారు . వారు మానవులే మనము మానవులమే అందరిలోనూ దేవుడున్నాడు మరి వారెందుకు మహానీయులయ్యారు ? వారు నిద్రాహారాలు మాని అనుక్షణం వారిలోవున్న భగవంతుని  ఉనికి  కోసం తపించి సాదించి  ఆత్మసాక్షాత్కారం పొందారు. తద్వారా మహనీయులు , మార్గదర్శకులు అయ్యారు. వీరందరివి దారులు వేరైనా గమ్యం ఒక్కటే అదే భగవంతునికి దగ్గర కావటం అనగా మన జన్మ సార్ధకతను తెలుసుకోవటం , మనల్ని మనం తెలుసుకోవటం మంచిని పెంచిపోషించి చెడుని ఖండించటం ఏ మతములోని భక్తిభావన అయినా మంచే చెప్తుంది . "ఒక దర్మం తప్పిన భక్తునికంటే దర్మం తప్పని నాస్తికుడే భగవంతునికి ఇష్టమట " . 

అది తెలుసుకోలేక కొంతమంది మూడ భక్తితో మూడ  విశ్వాసాలతో ,  మత విద్వేసాలతో ఎదుటవారి ఆచార వ్యవహారాలను కించపరుస్తూ  అజ్ఞానమనే వూభిలోకి కూరుకుపోతున్నారు. అంతే కాకుండా  తమ స్వార్ధం తో మతవిద్వేసాలను రెచ్చగొడుతున్నారు , బలవంతపు మతమార్పిడులు చేస్తున్నారు. ఈ మతవిద్వేసాలను రెచ్చగొట్టటం అనేది ఏ ఒక్క మతానికి అంటగట్టినా  పొరబడినట్టే .  ఈ అనర్దాలకి తోడు దొంగ గురువులు ,స్వామీజీలు భక్తుల బలహీనతలతో ఆడుకుంటున్నారు . వారి లీలని కళ్ళార వీక్షించి కూడా వారినే మూడ భక్తితో మూర్ఖంగా కొలుస్తున్నారు కొంతమంది జనాలు.  వారిని మన చట్టాలు ఏమి చెయ్యలేవు ఒకవేలా చేసినా ఏనుగు చచ్చినా బ్రతికినా ఒక్కటే అన్నట్టు వుంటుంది .

 చివరిగా:  నావికుని గమ్యం చేరటానికి దీపపు స్తంభం ఎంత అవసరమో మన జన్మ రహస్యం తెలుసుకొని మన లక్ష్యాలను చేరుకోవటానికి కూడా ఒక సద్గురువు అవసరం ఎంతైనా వుంటుంది అంతేకాని దానికి మతము అను ముసుగు వేయరాదు  ఏ దేవుడు ఇతర మతాల వారిని పిల్లాపాప అనికూడా చూడకుండా  ఊచకోత కోయమని చెప్పలేదు ఏ ప్రవక్తా  ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి అమాయికుల ప్రాణాల్ని తియ్యమని చెప్పలేదు  యే దేవుడు ఇతర మతాల వారిని కించపరచి మతమార్పిడులు చెయ్యమని చెప్పలేదు . మనం ఒక సన్మార్గం లో వెళ్ళటానికి మాత్రామే మతమనేది ఉపయోగపడాలి .

"సబ్ కా మాలిక్ ఏక్ హై"   అన్న సాయినాదునితో పాటు "సర్వమతాల సారం ఒకటే " అని బోదించిన ప్రతి సద్గురువుకి   జోహార్లు.
                                      
                                                                                                                                                          "మన తెలుగు మన సంస్కృతి "

చింత ఏల

పొద్దు గూకిందని గుబులు ఏల
మరలా అరుణోదయం ఉందిగా 
శిశిరం వచ్చిందని చింత ఏల ?
వసంతం వుందిగా
అమావాస్య అయ్యిందని  నిరాశ   ఏల?
పున్నమి ఉందిగా
నిన్న లేదనీ దిగులు  ఏల?
రేపు ఉందిగా
నీ కంటూ ఎవరు లేరని దిగులు ఏల? 
నీ నీడ ఉందిగా
కష్టం వెనుకే సుఖం
సుఖం వెనుకే కష్టం
అదే కష్ట సుఖాల సంగమం ఈ జీవితం  
                                              
                                                     నీలారవిందం

మా తెలుగు తల్లికి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి       || మా|| 

గలగలా గోదారి కదిలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి              ||మా||

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
 రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం  నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ !  జై తెలుగు తల్లీ ! 
     

                                                    శ్రీ శంకరంబాడి సుందరాచార్య

మతం ముసుగు

                                                   భక్తి-సంస్కృతి
మంచి నడవడిక కోసం ,మనిషి మనుగడ కోసం , మనిషి సృస్టించుకున్నదే మతం. మతం పుట్టక ముందు మనిషి జీవించలేదా? కాలానుగుణంగా మతాలు  పుడుతున్నాయి. అందులో చాలా పురాతనమైనవి వున్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం  పుట్టినవి కూడా  వున్నాయి, ఏ మతం అయినా మనిషిని మంచి దారిలోనే నడువమంటుంది . దురదృష్టం కొద్ది మతం ముసుగులో  నరమేదాలు, మత మార్పిడులు  జరుగుతున్నాయి . ఈ రోజు రోడ్డు మీద ఒక వాల్ పోస్టర్  చూసాను  అందులో " ప్రపంచం ప్రమాదం లో వుంది" అని వ్రాసుంది . ఇలాంటి ఆకర్షనీయమైన ప్రకటనలతో, ప్రలోభాలతో జనాలను మభ్య పెట్టే స్థాయికి  దిగాజరిపోతున్నాయి మతాలు  , ఏం? ఎన్నో ప్రకృతి  వైపరిత్యాలు  జరిగాయి , జరుగుతున్నాయి వాటిని ఆపవచ్చుకదా.  అయ్యప్ప యాత్రలో అపశ్రుతులు ,అమ్మవారి సన్నిదిలో దొంగతనాలు , గుడిలో చోరీలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో  అరాచకాలు జరుగుతున్నాయి , ఉగ్రవాదం మాటున ఎన్నో అమాయక ప్రాణాలు కలిసిపోతున్నాయి , వారిని కొత్త అల్లుళ్ళులా చూసుకుంటున్నాయి మన ప్రభుత్వాలు , వారిని ఉరి తెయ్యాలా? వద్దా? అని కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ  కప్పగంతులు వేస్తున్నారు మన ప్రభువులు . "  మాకు ఓటు బ్యాంకు కాదు ముఖ్యం ప్రజా సంక్షేమమే ముఖ్యమని " వారు అనుకొనేటట్టు వారి మనసులని ఆ దేవుడు ఎందుకని మార్చట్లేదు ?  , నిండు గర్బిణి అని కూడా చూడకుండా ఒక మతం మహిళను వేరొకరు చీల్చి పిండాన్ని తునా తునకలు చేసి పైచాచిక ఆనందం పొందితే ఎందుకు  ఏ దేవుడు వచ్చి ఆ ఘోరాన్ని  ఆపలేదు? . "ఈ ప్రపంచం  ప్రమాదంలో" అని వ్రాతలు  వ్రాస్తూ జనాల్ని ఆపరేషన్ "ఆకర్ష " ద్వారా రప్పిస్తున్నారు  అంటే   మేము దాన్ని నిలువరిస్తాము అనేకదా దానర్దం . పోనీ ఇలాంటి మీటింగులు రోజు ఏదో ఒక చోట జరుగుతున్నాయి ఎన్నో వేలు లక్షల మంది  వస్తున్నారు వారందరి ప్రార్ధనలు  మూలంగా నైనా ఈ సునామీలు, అత్యాచారాలు వైపరిత్యాలు ఆగాలికదా . పోనీ వారి స్వప్రయోజనం కోసమే ప్రార్ధనలు  చేసారనుకుందాం   అలాంటప్పుడు వారైనా పరి పూర్ణలుగా  తయారయి వాళ్ళ బాధలన్ని పూర్తిగా తొలగిపోయినాయా? అంటే దానికి వారి దగ్గర సమాదానం ఉందా? పోనీ వారే  స్వచ్చమైన దేవుడి బిడ్డలే అనుకుందాం మరి వేరే మతల్లోని వాళ్ళు పాపులా?  వేరే మతాలలో యోగులు లేరా ? ధనవంతులు లేరా? సుగుణ సంపన్నులు లేరా? అలా అయితే ఆ ఒక్క మతం వాళ్ళే  బతికి బట్ట కట్టాలి ? అన్ని రోగాలు స్వస్తత మహాసభల ద్వారా తీరిపోతయా? అలా అయితే ఇన్ని ఆసుపత్రులెందుకు? ఇంతమంది మహానుభావులెందుకు ?మదర్ థెరీసా లెందుకు? మహాత్మగాందీ లెందుకు?  కటినమైన వాళ్ళ త్యాగాలెందుకు?
ఇలా ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఎన్నెనో జవాబులు లేని ప్రశ్నలు వీటికి ఒక్కొక్కరు ఒక్కో రీతిలో సమాదానపరచవచ్చు గాక కానీ ఏది నిజం? ఇప్పుడు మనం చూస్తున్న మహానుబావులు కొన్నితరాల తరువాత దేవుళ్ళుగా, గురువులుగా  ఆరాదించబడతారు . ఎన్నో స్కాములు చేసిన లీడర్లు రేపటి తరానికి మహా నేతలు అవుతారు  పాపం వారికీ తెలిదు కాల ప్రవాహంలో నేత మహానేత , గురువు సద్గురువు వీటన్నిటికి అర్దాలు మారిపోతున్నాయి , ఏమో చెప్పలేము ఈనాటి  నిత్యానందలు రేపటి తరానికి సద్గురువులు అయినా అయిపోవచ్చు వారిలో లోపాలు ఈ తరం వారికీ తెలుసు ఆ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు  కొన్ని తరలు మారాక గాంధిజీ కి గుడులు ఉండొచ్చు(ఇప్పటికే కొన్ని చోట్ల  వున్నాయి )  అలా  అని గాంధీ గారిలో లోపాలు లేవని ఎవరు చెప్పలేరు? అలా అని  అయన మహాత్ముడు అని చెప్పకుండా ఉండలేము .  
ఇవన్ని చూస్తే ఈ ప్రపంచంలో లోపం లేని మనిషంటూ ఎవరూ వుండరు వుండబోరు అనిపిస్తుంది . అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు వీటన్నిటిని జయించే మానవుడు బహుశా వుండరేమో అలా అని ఋషులను వారు భావితరాలకు అందించిన అమూల్యమైన విజ్ఞాన సంపదను మనం కీర్తించకుండా ఉండగలమా? విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్నే సృష్టించాడు అంటారు అటువంటి విశ్వామిత్రుడు మేనక మైకం లో పడలేదా మహా కోపిష్టి అని కూడా అంటారు అలా అని వారి కీర్తిని కీర్తించకుండా ఉండగలమా? అందులో వారి వ్యక్తిగతమైన బలహీనతలు లోపాలు చూడకుండా వారు లోక కల్యాణం కోసం చేసే మంచిపనులునే చూడల్సివుంటుంది . అభిమానం,  భక్తీ శ్రుతి మించితే కుస్బూకి , నమితాకి కూడా గుడులు గోపురాలు  వెలుస్తాయి. మన ప్రక్క రాష్ట్రము లో వెలసాయి కూడా  ఏమో మన నిత్యానందులు వారికీ భవిష్యత్ లో  గుడులు వుంటాయేమో . మనిషిలోని  మంచితనం సేవాగుణం  వారి బలహీనతల్ని , లోపాల్ని కనబడనీయకుండా చేసిన బలమైనది అయితే వారిని లోకo  గౌరవిస్తుంది ,శ్లాగిస్తుంది , ఆరాదిస్తుంది . ఇందులో డబ్బు, పలుకుబడి ఉన్నవారి మాట కూడా అప్పుడప్పుడు చెల్లుబాటు అవుతుంది కాకపోతే అది కొంత కాలమే 
ఈ ప్రపంచం లో లోపం లేని మనిషంటూ ఎవరు వుండరేమో వుండబోరేమో అనిపిస్తుంది .  అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు లో కనీసం ఏదో ఒకటి వుంది తీరుతుంది .
ఇతరులకి హాని చెయ్యని , పరులకోసం జీవితాల్ని అర్పించే ప్రతి మనిషి దేవుడే.  
మంచిని మించిన దైవం లేదు చెడును మించిన దయ్యం లేదు

Tuesday 23 October 2012

తెలుగమ్మ కూతురు




నిను  చూసి వసంతం చిన్నబోతుంటే
ముగ్గులకే ముచ్చట  వేసింది
కమలానికి  కలవరం వస్తే
కలువ వచ్చి కన్నీటిని  తుడిచింది

పైర గాలి పరవళ్ళు తొక్కితే
పిల్ల గాలి పరుగు పరుగన వచ్చింది
నీ చెక్కిళ్ళు చూసి  సూరీడు  చిన్నబోతుంటే
ఇది ఏమి చిత్రమో అన్నది  ఆ  నీలి ఆకాశం 


వయ్యారి గోదారి వంకర్లు పోతుంటే
నిను చూసి  కృష్ణమ్మ నివ్వెరపోయింది 
నీ జడతో నాగమ్మ  నాట్యమాడుతుంటే  
అది చూసి నటరాజు నొచ్చుకున్నాడు

చిగురాకు సిగ్గుతో తలదించుకుంటే
వికసించినా పుష్పం  విలవిల ఏడ్చింది
అది చూసి  తెలుగమ్మ తనివి తీరా మురిసి 
తన కూతురేయని దీవించ కోరింది      

                                                
                                                            త్రినాద్





దసరా దినుసులు


ముచ్చటను గొలిపేటి మా మంచి ముంగిళ్ళు
కొనుగోళ్ళ కలిమితో కిక్కిరిసే అంగళ్లు
బంతిపూలతోడ బతుకమ్మ పాటలు
కనువిందు చేసేటి కోలాట సందడులు
గల గలా పారేటి సెల ఏటి సవ్వడులు
పక్వానికొచ్చేటి పచ్చనీ పైరులు
నిండైన పొదుగుల పాడావు పరుగులు
పాల బుగ్గలతోడ పసిపాప చిందులు
వయ్యారి భామల వగలైన ఒంపులు
చినదాని చెలిమికై చెలికాడి చూపులు
మందలించేటి మన మంచి బామ్మలు
పట్టు పీతంబరముల పసిడి వర్ణాలు
పునీతమైనట్టి పుట్టింటి లోగిళ్ళు
ఆదరణ గొల్పేటి అమ్మ ఆశీస్సులు
నేనున్నా నీకంటూ నాన్న దీవెనలు
దయచూపు దుర్గమ్మ చల్లని చూపులు
మట్టిలో కలిసేటి మహిషాస ముస్కరులు
మంచీకి చెడ్డకి మహాసంగ్రామాలు
దిశ దశను మార్చే దసరా దినములు


                                                              మన తెలుగు మన సంస్కృతి

మిత్రులందరికీ దసరా పండగ శుభాకాంక్షలతో మీ మన తెలుగు మన సంస్కృతి