Pages

Tuesday 23 October 2012

దసరా దినుసులు


ముచ్చటను గొలిపేటి మా మంచి ముంగిళ్ళు
కొనుగోళ్ళ కలిమితో కిక్కిరిసే అంగళ్లు
బంతిపూలతోడ బతుకమ్మ పాటలు
కనువిందు చేసేటి కోలాట సందడులు
గల గలా పారేటి సెల ఏటి సవ్వడులు
పక్వానికొచ్చేటి పచ్చనీ పైరులు
నిండైన పొదుగుల పాడావు పరుగులు
పాల బుగ్గలతోడ పసిపాప చిందులు
వయ్యారి భామల వగలైన ఒంపులు
చినదాని చెలిమికై చెలికాడి చూపులు
మందలించేటి మన మంచి బామ్మలు
పట్టు పీతంబరముల పసిడి వర్ణాలు
పునీతమైనట్టి పుట్టింటి లోగిళ్ళు
ఆదరణ గొల్పేటి అమ్మ ఆశీస్సులు
నేనున్నా నీకంటూ నాన్న దీవెనలు
దయచూపు దుర్గమ్మ చల్లని చూపులు
మట్టిలో కలిసేటి మహిషాస ముస్కరులు
మంచీకి చెడ్డకి మహాసంగ్రామాలు
దిశ దశను మార్చే దసరా దినములు


                                                              మన తెలుగు మన సంస్కృతి

మిత్రులందరికీ దసరా పండగ శుభాకాంక్షలతో మీ మన తెలుగు మన సంస్కృతి

No comments:

Post a Comment