Pages

Tuesday 9 October 2012

"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా"


ప్రపంచం లోనే మన తెలుగు లిపి రెండవ ఉత్తమమైనది గుర్తించబడిన సందర్భముగా తెలుగు వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు(మొదటి ది కొరియా లిపి ) 


   "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడా" అని తన పాట ద్వారా చాలా సంవత్సరాల క్రితమే  లోకానికి చాటి చెప్పిన వేములపల్లి శ్రీకృష్ణ గారి మాటలు వృధా కాలేదు నూటికి నూరుపాళ్ళు నిజమయ్యాయి ప్రపంచం లో ఎంతో మంది మహనీయులు తెలుగు భాష గొప్పదనాన్ని వేనోళ్ళా కొనియాడారు ఎటొచ్చి మనవాల్లలోనే తెలుగు అంటే చిన్న చూపు. ఈ సందర్భంగా   తెలుగుని ప్రేమించే ప్రతి మనిషి గర్వపడాలి . మనకి ఈ రోజు గుర్తింపు మన తెలుగు లిపి వలన వచ్చింది ప్రపంచంలో అనేకమైన భాషలుండగా మన తెలుగుకే ఎందుకు ఆ గౌరవం రావాలి అదే మన భాష గొప్పదనం. ప్రాంతలకతీతంగా ప్రతి తెలుగు వాడు గర్వంతో ఉప్పొంగిపోవాలి. కనీసం ఇప్పటినుండి అయినా మన పిల్లలకు తెలుగు గొప్పదనాన్ని చాటి చెప్పుదాం , మీ  పిల్లలకు తెలుగు సబ్జెక్టు లేకపోయినా కూడా ఇంటిదగ్గర అయినా నేర్పిస్తే బావుంటుంది . మీకే రాదంటారా అయినా  కూడా నిరాశ చెందవద్దు మనసుంటే మార్గం లేదా ?. మావాడికి తెలుగు రాదు అని గర్వంగా చెప్తారు కొంతమంది తెల్లిదండ్రులు గర్వం గా కాదు అది సిగ్గుపడుతూ చెప్పాల్సిన  విషయం.

ఈ విషయం లో తమంది పరభాషా టీవీ యాంకర్స్ ని నటులని ఆదర్శంగా చేసుకోవాలి .  వైపు తెలుగు తమ మాతృ భాష    అయినా కూడా మన అచ్చ తెలుగు  యాంకర్స్ ,హీరోయిన్స్ తెలుగు రానట్టు భీరాలు పోతూ తెలుగుని ఖూని చేస్తుంటే పరభాషా యాంకర్స్ హీరోయిన్స్ తెలుగును ఆరాధిస్తున్నారు . ఉదాహరణకి యాంకరింగ్ లోనే మొదటి స్థానం లో ఉన్న సుమ మనకి మలయాళీలా అనిపిస్తుందా? అలాగే శిల్పా చక్రవర్తి ఒక బెంగాలిఅంతెందుకు మహా నటుడు ప్రకాష్ రాజ్  , వీళ్ళంతా తెలుగును నేర్చుకున్నారు అనేదానికంటే  జీర్ణించుకున్నారు అని చెప్పటం సబబు. 



సిని రచయిత చంద్ర బోస్ చెప్పినట్టు

"పర భాష జ్ఞానాన్ని సంపాదించు నీ భాష జ్ఞానాన్ని మరువద్దు "
"అమ్మ అన్న పిలుపు లోన  అభిమానం జనిస్తుంది నాన్న అన్న పిలుపు లోన  ఆదరనే లభిస్తుంది"
ఇవినూటికి నూరుపాళ్ళు నిజం. పిన్ని బాబాయి,అత్తియ్య  మామయ్య అనే  ఈ కమ్మనైన పిలుపులు కనుమరుగు అవుతున్నాయి ఈ పిలుపుల్లో ఉన్న ఆప్యాయత ఇంగ్లీష్ మాటల్లో ఉంటాయా ?

ఆలోచిద్దాం ఆచరిద్దాం జై తెలుగు జై జై తెలుగు

                                                                                 మన తెలుగు  మన సంస్కృతి