Pages

Friday 12 April 2013

మంచి సినిమాకి ఆదరణ

 మంచి సినిమాకి ఆదరణ
ఒక సినిదర్శకుడంటాడు  మీకు(ప్రేక్షకులకు)  సినిమాలు చూడడం రాదు  నేను తియ్యటం బాగానే తీస్తున్నానని ఇంకో దర్శకుడటాడు మీరు  చెత్తసినిమాలు కోరుకుంటున్నారు కాబట్టి మేము చెత్త సినిమాలు తీస్తున్నామని వాళ్ళ భాద్యతా రాహిత్యం మాటలకేం గాని వారు మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఎందుకు ఆదరించారో నాగార్జున -రాఘవేంద్రరావుల అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి,  బాలకృష్ణ - బాపుల-రమణల శ్రీరామరాజ్యం నిరూపించాయి . అదే ప్రేక్షకులు పాండురంగడుని తిరస్కరించారు . ఇవే ఎందుకు అంటున్నాము అంటే ఇవి పౌరాణిక భక్తిరసాలు ఈ రోజుల్లో కూడా ఆదరణ వుందంటే ప్రేక్షకులు ఏమి మారలేదు మారాల్సింది దర్శక నిర్మాతలే. కధకదనాల్లో కొత్తదనం వుంటే అది చిన్న సినిమా పెద్దసినిమా పౌరాణికమా సాంఘీకమా అని ప్రేక్షకులు చూడరు మంచి కదా కధనం అవసరం . ఓనమాలు సినిమానే తీసుకుందాం దానికి కొనుగోలుదారులు లేక విడుదల చెయ్యటానికి నిర్మాత అష్టకష్టాలు పడినా అందుకు తగిన పలితంగా ప్రేక్షకులు ఆదరించారు. మంచిసినిమాలకి ఎప్పుడు ఆదరణ ఉంటుందని కొంతమంది దర్శక నిర్మాతలు ఎప్పుడు గ్రహిస్తారో మరి . ప్రేక్షకులు కూడా ఇలాంటి మంచి చిత్రాలని ముందు ముందు ఆదరించాలని కోరుకుందాం.

                                                                                                                                                                                                                                       .....త్రినాద్ 

ఆగును ఈ ఆగడాలు -Greatandhra

ఆగును ఈ ఆగడాలు

నిట్ట నిలువన నడిరోడ్డుపై 
ఉన్మాదులకు  ఉరితీసిన 
ఆగును ఈ ఆగడాలు  
బూజు పట్టిన చట్టాలను దులిపినప్పుడే
ఆగును ఈ ఆగడాలు  
దారి తప్పిన కొడుకులను కొట్టినపుడే
ఆగును ఈ ఆగడాలు
నీ చెల్లిలో ఆ చెల్లిని చూసినపుడే
ఆగును ఈ అరాచకాలు

                              
        మన తెలుగు మన సంస్కృతి 




601895_419417881436058_2069350130_n[1].jpg

దసరా దినుసులు

 దసరా దినుసులు

ముచ్చటను గొలిపేటి మా మంచి ముంగిళ్ళు
కొనుగోళ్ళ కలిమితో కిక్కిరిసే అంగళ్లు
బంతిపూలతోడ  బతుకమ్మ పాటలు
కనువిందు చేసేటి కోలాట సందడులు
గల గలా పారేటి సెల ఏటి సవ్వడులు
పక్వానికొచ్చేటి పచ్చనీ  పైరులు  
నిండైన పొదుగుల పాడావు పరుగులు
పాల బుగ్గలతోడ  పసిపాప చిందులు 
వయ్యారి భామల వగలైన ఒంపులు
చినదాని చెలిమికై చెలికాడి చూపులు
మందలించేటి మన మంచి బామ్మలు
పట్టు పీతంబరముల పసిడి వర్ణాలు
పునీతమైనట్టి పుట్టింటి లోగిళ్ళు
ఆదరణ గొల్పేటి అమ్మ ఆశీస్సులు
నేనున్నా నీకంటూ నాన్న దీవెనలు 
దయచూపు దుర్గమ్మ చల్లని చూపులు 
మట్టిలో కలిసేటి మహిషాస ముస్కరులు 
మంచీకి చెడ్డకి మహాసంగ్రామాలు 
దిశ దశను మార్చే దసరా దినములు 

                                           మన తెలుగు మన సంస్కృతి


కొన ఊపిరి కన్నతల్లి

కొన ఊపిరి కన్నతల్లి


కొనఊపిరి నీకన్నతల్లిని  మన తెలుగుతల్లిని
కరుడుకట్టిన నీ కసాయితనమే 
కాల్చివేస్తున్నదిరా తెలుగు తమ్ముడా   
తరం మారి జనం మారితే
మట్టేరా మన అమ్మ బుగ్గేరా మన బ్రతుకు
తల్లిని దూరం పెట్టి 
తనయుడి ధర్మం మరచి  దేన్నీ సాధించాలని ?
తల్లి పేరు చెప్పుటకే  సిగ్గుపడే తెలుగు తనయుడా 
అమ్మ లేని అనాధవై నీ ఉనికి కోల్పోయి
నడిచి నడిచి, పరుగులెత్తి,సొమ్మసిల్లి
పడిపోయిన ప్రతిసారి ఓదార్చేదెవరురా?  
బాధ పడిన ప్రతిసారీ 
గాయపడిన మరోసారి 
ఉంటుందా?'అమ్మా' అని పిలిచే ఈ ఆదరణ 
అమ్మ లేని సమయాన 'మమ్మీ' అని అంటావా?
మమ్మీ మమ్మీ అంటే 'సమాద'ని తెలిసి
సమాధిలో అమ్మని మరలా పిలుస్తావా 
నిజం మరచిపోకురా తెలుగోడా 
తల్లిని బ్రతికించరా తెలుగు తనయుడా  

                                   త్రినాద్ 

ప్రతి దినం

  ప్రతి దినం 

ఒక ప్రక్క విలాస జీవితం..వికృత వలయం
బంగారు సింహాసనం ..బలుపుల సామ్రాజ్యం
మరో ప్రక్క  తులం బంగారం కొనాలంటే కటకట
ఒక పక్క లక్ష కూడా చూడని మొహాలు 
మరో పక్క  లెక్కపెట్టలేని  లక్షల కోట్లు
ఒక పక్క కుంభ వృష్టి తో బతుకులు చిద్రం
మరో  పక్క కుంభకోణాలతో వారి బతుకుల భద్రం.
వీర మరణం పొందినోడికి వెయ్యినోట్లు 
బంతాట ఆడినోడికి  కోట్ల మూటలు
సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి..
నాయకులు వారే పార్టీలు మాత్రం వేరే.
మార్పు అని మాయ మాటలు చెప్పినోళ్ళు వారే మారిపోతున్నారు
నిజాయితీగా వుండే నాయకులకి మనం ఆదరించం
కాని  మార్పు కావాలంటాం కాని మనం మారం
మన దారి మనదే మన పార్టీలు మనవే
మన కులాలు మనవే మన కుమ్ములాటలు మనవే.
మనకి ఓటుకు నోటుంటే  చాలు .
ఇచ్చే ఒక  చెయ్యినే చూస్తాం  లాక్కొనే  పదిచేతులు చూడం
మనం ముష్టి కోసమే చూస్తాం కానీ మనుగడ కోసం చూడం.
వాళ్ళు తినే ఎంగిలాకువిసిరేస్తే యెగిరి గంతేస్తాం 
వాళ్ళను మహానుభావులంటాం మనసులో గుడి కట్టుకుంటాం .
తల్లి పుస్తులు అమ్మి హీరోలకి ఉత్సవాలు  జరిపిస్తాం
వాడో ముష్టి దండం పెడితే మురిసిపోతుంటాం .
వాడు కోట్లు కూడబెట్టుకుంటే మనం కాలు దువ్వుతాం
కన్నవాళ్ళని మాత్రం కాల్చుకు తింటాం .
సానులకి సాగిలపడి గుడులు కడతాం
మహనీయులని మర్చిపోతుంటాం .
ఇంగిత జ్ఞానం లేకుండా ఇంగ్లిషోడి దినాలు చేస్తాం
ఉషస్షు నిచ్చే ఉగాదులంటే  ఉలికులికి పడతాం
తెలుగు సంవత్సరాది నాడు "హ్యాపీ ఉగాడీ" అంటాం
భారతీయులమంటాం  బానిసలుగా ఉంటాం  .
ఈ రోజు ఈ దినం రేపు మరోదినం
ఎల్లుండి  మన తాతయ్య తద్దినం
రోజూ ఏదో ఒక సన్నాయి మేళం,
ప్రతి రోజు ఏదో ఒక శ్మశాన నాదం ఏముంది ప్రత్యేక దినదినం . 


                                                            మీగడ త్రినాధ రావు
                                                       మన తెలుగు మన సంస్కృతి 

మతం మత్తు


మతం మత్తు


మతం మత్తులో  జోగుతూ.. ఊగుతూ..
పరమాతాన్ని ద్వేషించే నాయకులారా ..
కండకావరంతో బలసి .నోరు పారేసుకోకండి
ఇది లౌకిక రాజ్యమని చిన్న చూపా?
ఇది లౌకిక రాజ్యం కాకుంటే మీ స్థానం ఎక్కడ?
పచ్చగా అన్నదమ్ముల వలె
బ్రతుకుతున్న ఈజాతికి ..
మీ స్వార్ధం కోసం రెచ్చగొట్టి.. చిచ్చుపెట్టి..
మీ పబ్బం గడుపుకోవాలని  చూడొద్దు
చంపినోడు మీ జాతి వాడని చూస్తున్నారే  ?
మీ జాతి భరత జాతని నీకు గుర్తుకు రాలేదా?
వాడు మీ తమ్మున్నీ  చంపాడు,మీ చెల్లినీ  చంపాడు.
భారత దేశం ఉప్పుతిని ..భారతినే తిట్టి పోస్తారా?
పాలు త్రాగిన రొమ్మునే గుద్దుతున్న పాపాత్ములారా ..
మీరు  ఉగ్రవాదులా? ఊసరవల్లులా  ?
మీకు ప్రక్క రాజ్యం మీద ప్రేమ పొంగితే
అక్కడికే పొండి అంతేకాని ఈ శాంతి సౌధానికే నిప్పు
పెట్టాలని చూడకండి  అందులో కాలి బూడిదౌతారు .

                               మీగడ త్రినాధ రావు
                          మన తెలుగు మన సంస్కృతి

మానవత్వ మత చాందసం -http://telugu.greatandhra.com/politics/jan2013/04_manavath_matha.php

మానవత్వ మత చాందసం 

||మానవత్వం అనే మతం ముందు
అన్ని మతాలు చిన్నబోతున్నాయి
మానవత్వం అనే కులం ముందు
అన్ని కులాలు కుళ్లిపోతున్నాయి
మానవత్వం అనే జాతి ముందు
అన్ని జాతులు జీవం కోల్పోతున్నాయి
మానవత్వం అనే వర్గమందు 
అన్ని వర్గాలు వెల వెల బోతున్నాయి
మానవత్వం అనే ప్రాంతమందు
అన్ని ప్రాంతాలు పాతరవుతున్నాయి
మానవత్వం అనే పార్టీ ముందు
అన్ని పార్టీలు పటాపంచలౌతున్నాయి
మానవత్వం అనే మనిషి ముందు 
మూర్ఖులందరూ మూఢులౌతున్నారు
మానవత్వ మత చాందసం ముందు   
అన్ని మతాల చాందసులు చిన్నబోతున్నారు ||


మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి