Pages

Friday, 12 April 2013

కొన ఊపిరి కన్నతల్లి

కొన ఊపిరి కన్నతల్లి


కొనఊపిరి నీకన్నతల్లిని  మన తెలుగుతల్లిని
కరుడుకట్టిన నీ కసాయితనమే 
కాల్చివేస్తున్నదిరా తెలుగు తమ్ముడా   
తరం మారి జనం మారితే
మట్టేరా మన అమ్మ బుగ్గేరా మన బ్రతుకు
తల్లిని దూరం పెట్టి 
తనయుడి ధర్మం మరచి  దేన్నీ సాధించాలని ?
తల్లి పేరు చెప్పుటకే  సిగ్గుపడే తెలుగు తనయుడా 
అమ్మ లేని అనాధవై నీ ఉనికి కోల్పోయి
నడిచి నడిచి, పరుగులెత్తి,సొమ్మసిల్లి
పడిపోయిన ప్రతిసారి ఓదార్చేదెవరురా?  
బాధ పడిన ప్రతిసారీ 
గాయపడిన మరోసారి 
ఉంటుందా?'అమ్మా' అని పిలిచే ఈ ఆదరణ 
అమ్మ లేని సమయాన 'మమ్మీ' అని అంటావా?
మమ్మీ మమ్మీ అంటే 'సమాద'ని తెలిసి
సమాధిలో అమ్మని మరలా పిలుస్తావా 
నిజం మరచిపోకురా తెలుగోడా 
తల్లిని బ్రతికించరా తెలుగు తనయుడా  

                                   త్రినాద్ 

No comments:

Post a Comment