Pages

Friday 12 April 2013

ప్రతి దినం

  ప్రతి దినం 

ఒక ప్రక్క విలాస జీవితం..వికృత వలయం
బంగారు సింహాసనం ..బలుపుల సామ్రాజ్యం
మరో ప్రక్క  తులం బంగారం కొనాలంటే కటకట
ఒక పక్క లక్ష కూడా చూడని మొహాలు 
మరో పక్క  లెక్కపెట్టలేని  లక్షల కోట్లు
ఒక పక్క కుంభ వృష్టి తో బతుకులు చిద్రం
మరో  పక్క కుంభకోణాలతో వారి బతుకుల భద్రం.
వీర మరణం పొందినోడికి వెయ్యినోట్లు 
బంతాట ఆడినోడికి  కోట్ల మూటలు
సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి..
నాయకులు వారే పార్టీలు మాత్రం వేరే.
మార్పు అని మాయ మాటలు చెప్పినోళ్ళు వారే మారిపోతున్నారు
నిజాయితీగా వుండే నాయకులకి మనం ఆదరించం
కాని  మార్పు కావాలంటాం కాని మనం మారం
మన దారి మనదే మన పార్టీలు మనవే
మన కులాలు మనవే మన కుమ్ములాటలు మనవే.
మనకి ఓటుకు నోటుంటే  చాలు .
ఇచ్చే ఒక  చెయ్యినే చూస్తాం  లాక్కొనే  పదిచేతులు చూడం
మనం ముష్టి కోసమే చూస్తాం కానీ మనుగడ కోసం చూడం.
వాళ్ళు తినే ఎంగిలాకువిసిరేస్తే యెగిరి గంతేస్తాం 
వాళ్ళను మహానుభావులంటాం మనసులో గుడి కట్టుకుంటాం .
తల్లి పుస్తులు అమ్మి హీరోలకి ఉత్సవాలు  జరిపిస్తాం
వాడో ముష్టి దండం పెడితే మురిసిపోతుంటాం .
వాడు కోట్లు కూడబెట్టుకుంటే మనం కాలు దువ్వుతాం
కన్నవాళ్ళని మాత్రం కాల్చుకు తింటాం .
సానులకి సాగిలపడి గుడులు కడతాం
మహనీయులని మర్చిపోతుంటాం .
ఇంగిత జ్ఞానం లేకుండా ఇంగ్లిషోడి దినాలు చేస్తాం
ఉషస్షు నిచ్చే ఉగాదులంటే  ఉలికులికి పడతాం
తెలుగు సంవత్సరాది నాడు "హ్యాపీ ఉగాడీ" అంటాం
భారతీయులమంటాం  బానిసలుగా ఉంటాం  .
ఈ రోజు ఈ దినం రేపు మరోదినం
ఎల్లుండి  మన తాతయ్య తద్దినం
రోజూ ఏదో ఒక సన్నాయి మేళం,
ప్రతి రోజు ఏదో ఒక శ్మశాన నాదం ఏముంది ప్రత్యేక దినదినం . 


                                                            మీగడ త్రినాధ రావు
                                                       మన తెలుగు మన సంస్కృతి 

No comments:

Post a Comment