Pages

Thursday 1 November 2012

"మన సంస్కృతిని కాపాడుదాం"

 "మన సంస్కృతిని కాపాడుదాం"

ముందుగా తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్బముగా  తెలుగు ప్రజలకు మరియు భాషాభిమానులకు మా శుభాకాంక్షలు 

ఈ ప్రపంచం లో ప్రతి మనిషికి ఒక ఉనికి వుంది. వుండాలి కూడా ముఖ్యంగా వేరే దేశాలు లేదా వేరే రాష్ట్రాల్లో వుండే ప్రజలుకు  . మన తెలుగు వాళ్ళ విషయానికే వస్తే మేము తెలుగు వాళ్ళము అని గర్వం గా చెప్పుకొనే సంస్కృతీ మరియు భాష మనది . అమెరికా లాంటి దేశాలల్లో తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన ఒక గుర్తింపు వుంది అంటే అది కేవలం మన భాష , సంస్కృతి మరియు ఆచార వ్యవహారాల గొప్పతనమే .

"ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా  
   పొగడరా నీతల్లి భూమి భారతిని
   నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అని లోకానికి చాటిచెప్పిన రాయప్రోలు సుబ్బారావు గారు మన తెలుగు వారే.
  యావత్ భారతావనికి మువ్వెనలు జెండాను రూపకల్పన చేసింది మన పింగళి వెంకయ్య గారు 
  తెల్లవాడి గుండెల్లో గుబులు పుట్టించిన అల్లూరి, రజాకారుల గుండెల్లో రైళ్ళు  పరుగెత్తించిన కొమరం భీం, కేంద్రం మె డలు వంచి గాంధీ మార్గమెంచి ఆంధ్ర ప్రదేశ్ ను తెలుగువారికిచ్చిన పోట్టి శ్రీరాములు ఒకరా ఇద్దరా ఎందరో మహానబావులు ,కవులు ,గాయకులూ త్యాగదనులు  ఎందరని పొగడాలి కవులు గాయకులూ అందరికి శిరశు వంచి  ప్రనమిల్లాల్సిన తరుణమిది .


ఒకప్పుడు మనకంటూ ఒక ఉనికి లేదు,  మనల్ని "మదరాసీలు" అనే వారు . పొట్టి శ్రీరాములుగారి ఆత్మత్యాగం తో మనం ఆంధ్రులమయ్యాము. మనది ఆంద్ర రాష్ట్రము అయ్యింది . లేదంటే ఇప్పటికి మనం వేరే వాళ్ళ అధీనం లో వుంటూ మదరాసీలుగానే వుండి పోయేవాళ్ళం. పొట్టి శ్రీ రాములుగారే కాకుండా మన తెలుగుజాతి  అభ్యున్నతికి మన భాష ప్రగతికి, మన సంస్కృతికి , సాహిత్యానికి  విశేషంగా కృషి చేసిన ఎందరో మహనీయులు , కవులు ,గాయకులూ , కళాకారులు ,జానపదులు వున్నారు.వారందరికీ మనం పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పాలి.

దురదృష్టశావాత్తు ఇంతటి ఘన కీర్తి కలిగిన తెలుగు భాషకు మన సంస్కృతికి బీటలు వారే పరిస్తితి దాపురించింది. మనము మన చేజేతులా మన భాషని సంస్కృతిని నాశనం చేసుకుంటున్నాము. ములిగేనక్కమీద తాటికాయ పడ్డట్టు మన పాలకులు కూడా అగ్నికి  ఆజ్యం పోసినట్టు ప్రవర్తిస్తున్నారు.  వారి మాటలు కోటలు దాటుతున్నాయి , కాని ఆచరణ సాద్యం కావటం లేదు. పొరుగు రాష్ట్రాల వారు వారి భాషాభివృద్దికి  యుద్ద ప్రాతిపదికన  కృషి చేస్తుంటే ఇంకా మన పాలకులు మీనమేశాలు లెక్కపెడుతున్నారు.  

చివరకి మనతెలుగు సినిమా పేర్లుకూడా పరాయి భాష పేర్లు  పెట్టుకోవలసిన దౌర్భాగ్యం దాపురించింది. ఈమధ్య వస్తున్న సినిమా పేర్లు గమనించండి. అందులో  వాడుతున్న భాషనీ గమనించండి . నేను ముంబయిని . .ఉ ................పోయిస్తానంతాడో సినీ రచయిత. ఈ మద్య ఒక సినిమా పేరు .."దూ...శ్రీను" . ఒకరు కాదు మనమందరం  కమ్మనైన మన తెలుగు భాషనీ , "దేశ భాషలందు తెలుగులెస్స" అని శ్రీకృష్ణ దేవరాయులచే కొనయాడబడిన  మన తెలుగు భాషనీ సర్వనాశనం చేస్తున్నాము. మన సినిమాల్లో కొంత మంది రచయితలు వాడుతున్న భాష చూస్తే ఇదే నిజమైన భాషేమో అని మన బావి తరాల వారు భ్రమ  పడే ప్రమాదం లేకపోలేదు .

కొన్ని ఆంగ్ల మాద్యమ బడులలో తెలుగు మాట్లాడ్డమే ఒక నేరం . తెలుగు మాట్లాడినందుకు పసిపిల్లలకు వాతలు పెట్టిన ఉద్దండులు వున్నారు .  సినీ రచయిత చంద్రబోసు గారు చెప్పినట్టు  "పర భాషా జ్ఞానాన్ని సంపాదించు నీ భాషా జ్ఞానాన్ని విడువద్దు" మారుతున్న కాలం దృష్ట్యా ఈ రోజుల్లో ఆంగ్లం తప్పనిసరి అయివుండవచ్చు. అలా అని మన భాషనీ సంస్కృతిని విడిచి పెట్టటం అనేది మన తల్లిని మనం మరిచినట్టే లెక్క.

మన మాతృ భాష నేర్చుకోవటం అనేది ఒక ఉపాదికి వనరుగా కాకుండా అది మన జీవితం లో భాగంగా గుర్తెరగాలి. అదే మనల్ని మన ముందు తరలవార్ని ఈ ప్రపంచం గుర్తించేలా చేస్తుంది.

దీని పరియవసానం మనకి ముందు ముందు తెలుస్తుంది . మన బిడ్డలకి ఈకమ్మనైన తెలుగు త్వరలో దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు . " మా తాతలు తెలుగులో  మాట్లాడే వారట వ్రాసే వారట"  అని మన పిల్లలు, మన మనుమలు ఆంగ్లంలో చెప్పుకొనే దౌర్భాగ్యం ఎంతో దూరంలో లేదు .

మన సంస్కృతిని కాపాడే విషయంలో ఇతర దేశాల్లో వుండే తెలుగు వారే ముందున్నారని చెప్పకతప్పదు . ఎందుకంటే  అమ్మ మనదగ్గర లేనిప్పుడే అమ్మవిలువ తెలిసేది . ఏది మన దగ్గర వుంటే దాని విలువ మనకితెలీదు  . వారు మాతృభూమికి దూరంగా వున్నరుగాబట్టి వారికి మన సంస్కృతీ సాంప్రదాయాల విలువ ఎక్కువ తెలుస్తుంది . ఎవరు రారు మన భాషనీ సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. కాగితం లేనిరోజుల నుండి ఉన్న సంస్కృతి ఇప్పటికి కొంత సజీవం గా వుందంటే , అది సజీవంగా వున్నట్లు చేసిన మనకవులు ,గాయకులూ ,జానపదులు గొప్పతనమే.

అంతర్జాలం( ఇంటర్నెట్) వచ్చిన తరువాత ఎన్నో తెలుగు వెబ్ సైట్స్ ,  బ్లాగులు, వార్తా పత్రికలు భాషా సంస్కృతిని విస్తరించచేయటం లో తమ పాత్రని పోషిస్తున్నాయి . అందులో భాగంగా మా వంతుగా ఒక చిరు ప్రయత్నంగా "మన తెలుగు సంస్కృతీ" పేరు మీద  ఫేసుబుక్ ఖాతాని మరియు బ్లాగును ప్రారంభించటం జరిగింది . ఇందులో కేవలం తెలుగుకి సంబందించిన రచనలు , వ్యాసాలు , ప్రముఖ కవుల పద్యాలూ , తెలుగు సాహితి సంపదను సేకరించి తద్వారా తెలుగు భాషాభివృద్దికి మా వంతుగా ప్రచారం చేయాలన్నదే మా చిరు ప్రయత్నం. ఇది ఏ ఒక్కరి వలన  జరిగే పని కాదు మనందరి సమిష్టి కృషితో జరగాలి .

దీనికి మనం చెయ్యల్సింది తెలుగుకి  సంబందిచి ఈ రచనలనైనా మా వాల్ లో పోస్ట్ చెయ్యవచ్చు మిగతా వారి పోస్టింగ్స్ కూడా నలుగురుకి మేలుచేసివిగా వుంటే మేము షేర్ చేస్తాము . తెలుగులో ఉన్నవాటికే మా మొదటి ప్రాముక్యత.  ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకోవటం మన భ్రమ. మన భాషని సంస్కృతి విస్తరించుకోవటం మన చేతుల్లోనే వుంది.అందుకు మనందరి  సహకారం కావాలి                                                                                                 
      www.manatelugumanasamskruti.blogspot.in

      www.facebook.com/manatelugumanasamskruti
                                                                                                         
                                                                                                                                 
  వ్యాస రచయిత                                                                                                    
  మీగడ త్రినాధరావు
  9848826150 
  మన తెలుగు మన సంస్కృతి