నిను చూసి వసంతం చిన్నబోతుంటే
ముగ్గులకే ముచ్చట వేసింది
కమలానికి కలవరం వస్తే
కలువ వచ్చి కన్నీటిని తుడిచింది
పైర గాలి పరవళ్ళు తొక్కితే
పిల్ల గాలి పరుగు పరుగన వచ్చింది
నీ చెక్కిళ్ళు చూసి సూరీడు చిన్నబోతుంటే
ఇది ఏమి చిత్రమో అన్నది ఆ నీలి ఆకాశం
వయ్యారి గోదారి వంకర్లు పోతుంటే
నిను చూసి కృష్ణమ్మ నివ్వెరపోయింది
నీ జడతో నాగమ్మ నాట్యమాడుతుంటే
అది చూసి నటరాజు నొచ్చుకున్నాడు
చిగురాకు సిగ్గుతో తలదించుకుంటే
వికసించినా పుష్పం విలవిల ఏడ్చింది
అది చూసి తెలుగమ్మ తనివి తీరా మురిసి
తన కూతురేయని దీవించ కోరింది
ముగ్గులకే ముచ్చట వేసింది
కమలానికి కలవరం వస్తే
కలువ వచ్చి కన్నీటిని తుడిచింది
పైర గాలి పరవళ్ళు తొక్కితే
పిల్ల గాలి పరుగు పరుగన వచ్చింది
నీ చెక్కిళ్ళు చూసి సూరీడు చిన్నబోతుంటే
ఇది ఏమి చిత్రమో అన్నది ఆ నీలి ఆకాశం
వయ్యారి గోదారి వంకర్లు పోతుంటే
నిను చూసి కృష్ణమ్మ నివ్వెరపోయింది
నీ జడతో నాగమ్మ నాట్యమాడుతుంటే
అది చూసి నటరాజు నొచ్చుకున్నాడు
చిగురాకు సిగ్గుతో తలదించుకుంటే
వికసించినా పుష్పం విలవిల ఏడ్చింది
అది చూసి తెలుగమ్మ తనివి తీరా మురిసి
తన కూతురేయని దీవించ కోరింది
త్రినాద్
No comments:
Post a Comment