Pages

Friday 26 October 2012

మతం ముసుగు

                                                   భక్తి-సంస్కృతి
మంచి నడవడిక కోసం ,మనిషి మనుగడ కోసం , మనిషి సృస్టించుకున్నదే మతం. మతం పుట్టక ముందు మనిషి జీవించలేదా? కాలానుగుణంగా మతాలు  పుడుతున్నాయి. అందులో చాలా పురాతనమైనవి వున్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం  పుట్టినవి కూడా  వున్నాయి, ఏ మతం అయినా మనిషిని మంచి దారిలోనే నడువమంటుంది . దురదృష్టం కొద్ది మతం ముసుగులో  నరమేదాలు, మత మార్పిడులు  జరుగుతున్నాయి . ఈ రోజు రోడ్డు మీద ఒక వాల్ పోస్టర్  చూసాను  అందులో " ప్రపంచం ప్రమాదం లో వుంది" అని వ్రాసుంది . ఇలాంటి ఆకర్షనీయమైన ప్రకటనలతో, ప్రలోభాలతో జనాలను మభ్య పెట్టే స్థాయికి  దిగాజరిపోతున్నాయి మతాలు  , ఏం? ఎన్నో ప్రకృతి  వైపరిత్యాలు  జరిగాయి , జరుగుతున్నాయి వాటిని ఆపవచ్చుకదా.  అయ్యప్ప యాత్రలో అపశ్రుతులు ,అమ్మవారి సన్నిదిలో దొంగతనాలు , గుడిలో చోరీలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో  అరాచకాలు జరుగుతున్నాయి , ఉగ్రవాదం మాటున ఎన్నో అమాయక ప్రాణాలు కలిసిపోతున్నాయి , వారిని కొత్త అల్లుళ్ళులా చూసుకుంటున్నాయి మన ప్రభుత్వాలు , వారిని ఉరి తెయ్యాలా? వద్దా? అని కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ  కప్పగంతులు వేస్తున్నారు మన ప్రభువులు . "  మాకు ఓటు బ్యాంకు కాదు ముఖ్యం ప్రజా సంక్షేమమే ముఖ్యమని " వారు అనుకొనేటట్టు వారి మనసులని ఆ దేవుడు ఎందుకని మార్చట్లేదు ?  , నిండు గర్బిణి అని కూడా చూడకుండా ఒక మతం మహిళను వేరొకరు చీల్చి పిండాన్ని తునా తునకలు చేసి పైచాచిక ఆనందం పొందితే ఎందుకు  ఏ దేవుడు వచ్చి ఆ ఘోరాన్ని  ఆపలేదు? . "ఈ ప్రపంచం  ప్రమాదంలో" అని వ్రాతలు  వ్రాస్తూ జనాల్ని ఆపరేషన్ "ఆకర్ష " ద్వారా రప్పిస్తున్నారు  అంటే   మేము దాన్ని నిలువరిస్తాము అనేకదా దానర్దం . పోనీ ఇలాంటి మీటింగులు రోజు ఏదో ఒక చోట జరుగుతున్నాయి ఎన్నో వేలు లక్షల మంది  వస్తున్నారు వారందరి ప్రార్ధనలు  మూలంగా నైనా ఈ సునామీలు, అత్యాచారాలు వైపరిత్యాలు ఆగాలికదా . పోనీ వారి స్వప్రయోజనం కోసమే ప్రార్ధనలు  చేసారనుకుందాం   అలాంటప్పుడు వారైనా పరి పూర్ణలుగా  తయారయి వాళ్ళ బాధలన్ని పూర్తిగా తొలగిపోయినాయా? అంటే దానికి వారి దగ్గర సమాదానం ఉందా? పోనీ వారే  స్వచ్చమైన దేవుడి బిడ్డలే అనుకుందాం మరి వేరే మతల్లోని వాళ్ళు పాపులా?  వేరే మతాలలో యోగులు లేరా ? ధనవంతులు లేరా? సుగుణ సంపన్నులు లేరా? అలా అయితే ఆ ఒక్క మతం వాళ్ళే  బతికి బట్ట కట్టాలి ? అన్ని రోగాలు స్వస్తత మహాసభల ద్వారా తీరిపోతయా? అలా అయితే ఇన్ని ఆసుపత్రులెందుకు? ఇంతమంది మహానుభావులెందుకు ?మదర్ థెరీసా లెందుకు? మహాత్మగాందీ లెందుకు?  కటినమైన వాళ్ళ త్యాగాలెందుకు?
ఇలా ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఎన్నెనో జవాబులు లేని ప్రశ్నలు వీటికి ఒక్కొక్కరు ఒక్కో రీతిలో సమాదానపరచవచ్చు గాక కానీ ఏది నిజం? ఇప్పుడు మనం చూస్తున్న మహానుబావులు కొన్నితరాల తరువాత దేవుళ్ళుగా, గురువులుగా  ఆరాదించబడతారు . ఎన్నో స్కాములు చేసిన లీడర్లు రేపటి తరానికి మహా నేతలు అవుతారు  పాపం వారికీ తెలిదు కాల ప్రవాహంలో నేత మహానేత , గురువు సద్గురువు వీటన్నిటికి అర్దాలు మారిపోతున్నాయి , ఏమో చెప్పలేము ఈనాటి  నిత్యానందలు రేపటి తరానికి సద్గురువులు అయినా అయిపోవచ్చు వారిలో లోపాలు ఈ తరం వారికీ తెలుసు ఆ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు  కొన్ని తరలు మారాక గాంధిజీ కి గుడులు ఉండొచ్చు(ఇప్పటికే కొన్ని చోట్ల  వున్నాయి )  అలా  అని గాంధీ గారిలో లోపాలు లేవని ఎవరు చెప్పలేరు? అలా అని  అయన మహాత్ముడు అని చెప్పకుండా ఉండలేము .  
ఇవన్ని చూస్తే ఈ ప్రపంచంలో లోపం లేని మనిషంటూ ఎవరూ వుండరు వుండబోరు అనిపిస్తుంది . అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు వీటన్నిటిని జయించే మానవుడు బహుశా వుండరేమో అలా అని ఋషులను వారు భావితరాలకు అందించిన అమూల్యమైన విజ్ఞాన సంపదను మనం కీర్తించకుండా ఉండగలమా? విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్నే సృష్టించాడు అంటారు అటువంటి విశ్వామిత్రుడు మేనక మైకం లో పడలేదా మహా కోపిష్టి అని కూడా అంటారు అలా అని వారి కీర్తిని కీర్తించకుండా ఉండగలమా? అందులో వారి వ్యక్తిగతమైన బలహీనతలు లోపాలు చూడకుండా వారు లోక కల్యాణం కోసం చేసే మంచిపనులునే చూడల్సివుంటుంది . అభిమానం,  భక్తీ శ్రుతి మించితే కుస్బూకి , నమితాకి కూడా గుడులు గోపురాలు  వెలుస్తాయి. మన ప్రక్క రాష్ట్రము లో వెలసాయి కూడా  ఏమో మన నిత్యానందులు వారికీ భవిష్యత్ లో  గుడులు వుంటాయేమో . మనిషిలోని  మంచితనం సేవాగుణం  వారి బలహీనతల్ని , లోపాల్ని కనబడనీయకుండా చేసిన బలమైనది అయితే వారిని లోకo  గౌరవిస్తుంది ,శ్లాగిస్తుంది , ఆరాదిస్తుంది . ఇందులో డబ్బు, పలుకుబడి ఉన్నవారి మాట కూడా అప్పుడప్పుడు చెల్లుబాటు అవుతుంది కాకపోతే అది కొంత కాలమే 
ఈ ప్రపంచం లో లోపం లేని మనిషంటూ ఎవరు వుండరేమో వుండబోరేమో అనిపిస్తుంది .  అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు లో కనీసం ఏదో ఒకటి వుంది తీరుతుంది .
ఇతరులకి హాని చెయ్యని , పరులకోసం జీవితాల్ని అర్పించే ప్రతి మనిషి దేవుడే.  
మంచిని మించిన దైవం లేదు చెడును మించిన దయ్యం లేదు

No comments:

Post a Comment