Pages

Friday, 12 April 2013

అన్నా రామన్నా -Greatandhra article

అన్నా రామన్నా

వెండి తెరకి  రారాజువి
మా గుండెల్లో మారాజువి
ఎన్నోన్నో కష్టాలు ఎన్నెన్నో నష్టాలు 
ధైర్యంతో దిగమింగి 
రాముడే నీవై  కృష్ణుడే నీవై
తెలుగు వాడి గుండెల్లో కొలువై
అఖిలాంద్ర నాయకుడువై
అన్నవై నావు
ఢిల్లీ డేగలను  ఢీ  ..కొట్టి ..తరిమి కొట్టి 
బానిస బ్రతుకులనుండి బయటపడేసావు
తెలుగువాడి వాడిని, వాడి వేడిని
నలుదిక్కులు చాటి నరకం తప్పించావు
తెలుగు తల్లి ఋణం తీర్చి
తిరుగులేని వాడివయ్యావు
రాజకీయ నాయకుడువై
రంగులు మార్చలేక పోయావు
చైతన్యం తెచ్చావు అభిమానం ఇచ్చావు
వెన్ను చూపని నాయకుడువై
వెన్ను పోటుకు బలయ్యావు
అటు పోట్లకు ఎదురీది
గుండె పోటుకు బలయ్యావు 
సముద్రాన్నే ఎదురీది
పిల్ల కాలువ దాటలేకపోయవు
వారు లేరు వీరు లేరు
ఇప్పుడయ్యావు అందరికీ  దిక్కు
నీ నామస్మరణే వారికి మొక్కు 
నాడు లేదు నేడు లేదు రేపు లేదు
అప్పటికీ ఇప్పటికీ మరెప్పటికీ
నువ్వే మాకు ఆదర్శం
తెలుగు జాతి  వెలుగు జాతి అయ్యిందప్పుడు
తెలుగు తల్లి వెలుగు తల్లి అయ్యిందప్పుడు 
మరి నువ్వు లేని
ఈ నేల తల్లి వెల వెల బోతుందిప్పుడు
ఢిల్లీ  డేగలే  ఏలుతున్నారెప్పుడూ
మమ్ము మసి చేసి మజా చేస్తున్నారిప్పుడు
ఢీ ..కొట్టిన వారే  ఢీలా పడిపోయి ..
నక్క వాతలు పెట్టుకొని నలిగి పోతున్నారు
మార్పులని వారే మారిపోయి..
చేర్పులని వారే చితికి పోయి..
మందిని ముంచేస్తున్నారు
ఒక్కసారి ఇటువచ్చి
నీ వేడి సెగను మాకిచ్చి
మళ్ళి ఈ జాతిని బ్రతికించు
అన్నా రామన్నా ఎవరున్నారన్నా
నీకన్నా..మాయన్నా!

                            మీగడ త్రినాధ రావు
                               9848826150
                       మన తెలుగు మన సంస్కృతి

No comments:

Post a Comment