వ్యక్తిగతం కాదు ముఖ్యం
నిన్న నేను ఎన్టీఆర్ గారి కోసం నేను వ్రాసిన కవిత నిన్న గ్రేట్ ఆంధ్ర లో "అన్నా మాయన్నా " అనే పేరుతో ప్రచురించటం జరిగింది. చాలామంది పొగిడారు, కొంతమంది విమర్శించారు కూడా, మరి కొంతమంది అయితే "చాలా మంది గొప్పవాళ్ళు వుండగా ఎన్టీఆర్ గురించే ఎందుకు రాయాలి " అని అన్నారు. ఈ వ్యాసం వారి విమర్శలకి గాని, పొగడ్తలకి వివరణ మాత్రమే కాని సంజాయిషీ కాని కాదు . మనిషి వ్యక్తిగతం వేరు అతను సమాజానికి చేసిన సేవ వేరు అని చెప్పటానికి ఈ చిన్న వ్యాసం రాస్తున్నాను . సందర్బం వచ్చినపుడు మిగతా వారి గురించి తప్పకుండా రాస్తాను. తప్పకుండా తెలుగువారిగా మనం వారికి నివాళి అర్పించాలి. "ఎందరో మహానుబావులు అందరికీ వందనాలు ". చాలా మంది మహానుబావులు వున్నారు సందేహం లేదు చాలా గొప్పవాళ్ళు వారి గురించి మాట్లాడకపోవటం రాయకపోవటం క్షమించరాని నేరం. నిన్న ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా రాసాను అంతే. ప్రత్యేకంగా నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు అలా అయితే అందులో "వెన్ను పోటు" అనే పదం రాదు తెలుగు వాళ్ళ చరిత్రలో రామారావు గారికి ఒక ప్రత్యెక స్థానం వుందని పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారు. ఈనాడు అన్ని పార్టీల వారు ఆయన జపమే చేస్తున్నారు కూడా . మనం ఆయన్ని ప్రత్యక్షంగా చూసాము కాబట్టి అయన లోటుపాట్లు తెలుసు పాత తరం నాయకులు కూడా అంతే వారి లోటు పాట్లు వ్యక్తిగత లక్షణాలు, బలాలు బలహీనతలు ఆ కాలంలో ఉన్నవారికే తెలుస్తాయి. మన మనుమలు కాలానికి వారికి మనం ఎంతో గొప్పగా కనిపిస్తాం. "వావ్ మాతాత గారు ఎన్టీఆర్ గారిని చూసారట వారితో కరచాలనం కూడా తీసుకున్నారట" అని మనకు కితాబు ఇవ్వవచ్చు. మనకేం అనిపిస్తుంది "ఎన్టీఆర్ యే కదా అనిపిస్తుంది.ఈనాడు ఎన్నో కుంబకోణాలు చేసిన నాయకులు కూడా కొన్ని తరాలు తరువాత గొప్ప నాయకులు కూడా కావచ్చు . గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి జాతి పిత కాని వారి కొడుకులు ఒక్కరైనా ? పేరులోకి వచ్చారా? వారి వివరాలు కూడా పెద్దగా తెలియదు అటువంటప్పుడు ఒక తండ్రిగా గాంధీ గారి వైఫల్యం ఉండవచ్చు . గాంధీ గారి మీద, నెహ్రు గారి మీద కూడా వ్యక్తిగతంగా చాలా విమర్శలు వున్నాయి . అతి వాదులు మిత వాదులు మద్య కూడా ఆ రోజుల్లో కోల్డ్ వార్ రాజకీయాలు ఉండేవంటారు . అంత మాత్రానికి వారిని "మహానుబావులు కాదు" అనే చెప్పలేము కదా . ఆ రోజుల్లో లక్షల సంపాదన వదులుకొని గాంధి గారు స్వాతంత్య సమరానికి సిద్దం అయ్యారు . నెహ్రు గారు అయితే కోట్ల ఆస్థి పరుడు . ఇక్కడ మనుషులు వ్యక్తిగతం కాదు వాళ్ళు మన దేశాభివృద్దికి , రాష్ట్రాభివృద్దికి, భాషాభివృద్దికి ఏం చేసారు అన్నదే కదా ముఖ్యం . ఒక వ్యక్తి వలన దేశానికి ఎక్కువ ఉపకారం జరిగిందా అపకారం జరిగిందా అనేదే ముఖ్యం . రామారావు గారికి కూడా వ్యక్తిగతంగా చాలా విమర్శలు వున్నాయి . వారి మీదే కాదు అభిమానులు దేవుళ్ళు లా భావిస్తున్న ఎంతో మంది పాత, కొత్త తరం నాయకులు మీద కూడా ఎన్నో వ్యక్తి గత విమర్శలు వున్నాయి . మల్లెమాల గారి పుస్తకం బయటకి రాలేదు కాని చాలా విషయాలు బయటకి తెలిసేవి (నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చదివాను కూడా ) అలా తెలుస్తాయనే ఆ పుస్తకాన్ని బాన్ చేసారు . ఆ పుస్తకం రాసిన మల్లె మాల గారు కూడా స్వచ్చమైన ఆచ్చమైన ముత్యం లాంటి మనిషి కాకపోవచ్చు . వారే కానప్పుడు ఈ వ్యాసం రాస్తున్న నేను కూడా స్వచ్చమైన ముత్యం లాంటి మనిషిని ఎలా అవుతాను? వారే కాదు ఈ ప్రపంచంలో ఈ లోపం లేని మనిషి ఎవరూ వుండరు వుండబోరు . అవన్ని పుస్తకాలకే పరిమితం అని నా అభిప్రాయం . కవిత అంతా రామారావు గారిని పొగుడుతూ నేనేం రాయలేదు కదా ఒక్కోసారి నిందించాను అవహేళన చేశాను కూడా (అది ప్రేమ పూర్వకంగానే అనుకోండి ) .
మీగడ త్రినాధ రావు

No comments:
Post a Comment