Pages

Friday, 12 April 2013

విద్యార్దుల బలిదానాలు-http://telugu.greatandhra.com/politics/jan2013/21a_vidyathri_danalu.php

విద్యార్దుల బలిదానాలు

ప్రాంతీయ వాదాలు , సమైక్య వాదాలు తారా స్థాయికి చేరుకున్న వేళ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కువ అవుతున్నాయి . కొంతమంది నాయకులు విద్యార్దులను  ఆత్మ హత్యలు చేసుకోవద్దంటూ ఉద్బోదిస్తూనే మరో పక్క రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తున్నారు (పరోక్షంగా చేసుకోమ్మనే కదా) . ఇంకా సమయం దగ్గరౌతున్న కొద్దీ ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు తీవ్రం అవుతూనే వుంటాయి . యధావిధిగా డిల్లీ పెద్దలు ప్రవర్తన కూడా  "మీలో మీరు తన్నుకు చావండి" అన్నట్టు గానే వుంటుంది

దయచేసి ఏ ప్రాంత విద్యార్దులు అయినా  నాయకుల ఊకదంపుడు ప్రసంగాలకు , రెచ్చ గొట్టే ప్రసంగాలకు "అతి"గా స్పందించి తీవ్ర బావోద్వేగాలకు లోనై మీ కన్నవారికి, కట్టుకున్నవారికి కడుపు కోత మిగిల్చే పనులు చెయ్యవద్దు . మీరు బావోద్వేగాలకు లోనయ్యే ముందు క్రింది విషయాలు గమనించండి .

1. ఎవరు ఎన్ని వాదనలు చేసినా ఇది కేంద్రం చేతిలో వున్న అంశం. వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు లేకుంటే లేదు 2014 వరకు ఏదో ఒక మంత్రం తంత్రంతో  
    నానుస్తూనే వుంటారు అని నా అభిప్రాయం .

2. మన ఆత్మ హత్యలు నాయకుల శవరాజకీయాలుకు  , లెక్కింపులకు మాత్రమే ఉపయోగపడతాయి, పడుతున్నాయి కూడా

3. శవాన్ని ఊరేగిస్తూ నానా యాగీ చేసి నానా కల్లబొల్లి కబుర్లు చెప్పే నాయకులు ఇది వరకు బలిదానం చేసుకున్న అమర వీరుల కుటుంబాలని ఆదుకున్నారా  
    ? అని మీలో మీరు ప్రశ్నించుకోండి . మీ కన్న వారి కడుపుకోత , మీరు లేని లోటు తీర్చగలరా? అని కూడా ప్రశ్నించుకోండి .

4." మేము ఏ త్యాగాలకైనా సిద్దం , మా పీకలు నరుక్కుంటాం , బలిదానాలు చేస్తాం" అని కళ్లబొల్లి ప్రసంగాలు చేస్తూ వుంటారే ? మరి ఇన్నేళ్ళ ఈ పోరాటాలలో , 
    ఉద్యమాలలో ఎంతమంది నాయకులూ వారి పీకలు నరుక్కున్నారు? ఎంతమంది వారి పుత్ర రత్నాలు బలిదానాలు చేసుకున్నారు ( ఇక్కడ చేసుకోమని  
    కాదు ఏ తల్లి అయినా తల్లే ఎవరికి అయినా కడుపుకోతే కదా అయినా వారు అంత తెలివి తక్కువ పనులేం చెయ్యరు లెండి  ).

5. ఏది ఏమైనా ప్రత్యెక ప్రాంతం కేవలం ఉద్యమాల ద్వారానే సాద్యం ఉద్యమాల ద్వారానే కేంద్రం మెడలు వంచాలి అంతేకాని మీరు  బలిదానం చేసుకుంటే ఆ ఒక్క
    రోజే  మాత్రమే మిమ్మల్ని  హీరోని చేసి  తరువాత ఆ మరునాడే మిమ్మిల్ని మర్చిపోతారు . కేవలం ఆ సంఖ్య లో మీది ఒక్క నెంబర్ అవుతుంది . మీ 
    కన్నవారి,  కట్టుకున్నవారి బాధలు ఒక్కసారి ఊహించుకోండి, ఆ తరువాత పరిణామాలు, వారు పడే కష్టనష్టాలు కూడా ముందుగానే ఊహించి
    మసలుకోమని మనవి.

             ****** ప్రత్యేక వాదం లేదా సమైఖ్య వాదం అనివార్యమైతే ఉద్యమాలు చెయ్యండి కాని ఊపిరి తీసుకోకండి  *******   

                                                                                                                    మీగడ త్రినాధ రావు
                                                                                                              మన తెలుగు మన సంస్కృతి

No comments:

Post a Comment