పాలకులు ప్రజలు పరిపాలనtrinadh.meegada@gmail.com
రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారు . రాష్ట్రం రావణ కాష్టం అయ్యింది పాలకులకు పరిపాలనతో సంబంధం లేదు . రాష్ట్రములో మరే ఇతర సమస్యలే లేనట్లు రాజకీయం అంతా ప్రాంతీయ వాదం, ప్రత్యేకవాదం చుట్టూనే తిరుగుతుంది. "ఒక్క మంత్రం తో అన్ని జబ్బులు పోతాయి " అన్న చందాన నాయుకులు ప్రవర్తిస్తునారు ప్రజల్లో కూడా ఆ భావన పాతుకు పోయినట్లు చేస్తున్నారు . నాయకులు ఎంచక్కా డిల్లి చుట్టూ చక్కర్లు కొట్టటం , బురదలు చల్లుకోవటం , ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం ఇవే వారి పనులు . ఒక ప్రక్క ప్రభుత్వం ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా ధరలతో సామాన్యుడి నడ్డి విరక్కోడుతుంది . బహుశా ఇంకా అధికారం లోకి రామని ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఇలా చేస్తుందా అని ఎవరికైనా అనిపించక మానదు . ఎన్నికలు దగ్గర అవుతున్నకొద్ది తాయిలాలు, సంక్షేమ పధకాల పేరిట ఎర వేసి వల వేస్తారు . ప్రతిసారి సామాన్యుడు మోసపోతూనే ఉంటున్నాడు . పార్టీలు వేరే కావచ్చు నాయకుకులు మాత్రం వారే అవుతున్నారు . ప్రతిసారి సామాన్యుడు పై ఎన్నికలు దగ్గర అవుతున్నకొద్దీ పార్టీలకు , ప్రభుత్వాలకు ఎక్కడ లేని అభిమానం ఒక్కసారిగా పుట్టుకొస్తుంది . ధరల పెరుగుతుంటే ఏ పార్టీకి పట్టదు. పెరిగిన ప్రతిసారి కేంద్ర "ప్రధాన" కొండపల్లి బొమ్మలు కాకమ్మ కధలు , కాకి లెక్కలు చెబుతూనే వుంటున్నారు . ప్రతిపక్ష మహాశయులు ధరలు పెరిగిన మరునాడు తూ తూ మంత్రంగా ప్రకటనలు నిరసనలు చేపడుతూ వుంటారు. అయితే ఈ విషయం లో వామ పక్ష పార్టీలను మనం కొంతలో కొంత అభిమానించి తీరాలి. ఎందుకంటే ధరల పెరుగుతున్నప్పుడు అయినా , ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అయినా కొద్దో గొప్పో స్పందించే పార్టీలు ఆ రెండే అని చెప్పవచ్చు . అలా అంటే మిగతా పార్టీల వాళ్ళు అంత ఎత్తున లేస్తారు. అధికారం వున్నా లేకపోయినా ఉద్యమాలు చేస్తూ వామ పక్ష పార్టీల నాయకులు రోడ్డెక్కి లాటీ దెబ్బలు తింటున్నారు . మరి మిగతా పార్టీలు ఈ రోజు ఏం చేస్తున్నాయో ఆయా పార్టీల వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు కాని అవి ప్రజలకు కొంతలో కొంతయినా ఉపయోగ పడేవిగా వుండాలి. ప్రజల్లో కూడా ప్రశ్నిచే తత్వం పోతుంది , ఎవరి కులం వారిది , ఎవరి మతం వారిది ఎవరి పార్టీ వారది , ఎవరి సామాజిక వర్గం వారిది . కొంత కాలం అయినా ప్రజలు వీటి నుండి బయట పడి తాయిలాలకు లొంగ కుండా , నిజాయితీ గల పార్టీలకు , నాయకులకు ఓటు వేసి విజ్ఞత ప్రదర్శించి నట్లయితే మన భవిష్యత్ తరాలు అయినా బాగుపడతాయి . లేకుంటే ఎక్కడి వేసిన గొంగళి అక్కడే వుంటుంది . "మార్పు కావలి" అన్న మనమే "మారి పోకుండా" నిర్భయంగా సంకుచిత భావాలు పక్కన పెట్టి నిజాయితీకి పట్టం కట్టాల్సిన అవసరం ఎంతయినా అవసరం వుంది . ఇదంతా చదివి నేను ఏ వామపక్ష పార్టీయో , లోక్ సత్తా పార్టీయో అనుకోవద్దు . పార్టీ ఏది అయినా ఈ సారి అయినా మనం మోసపోకుండా మార్పు వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను . అలా ధైర్యం , నమ్మకంతో వేసిన అడుగు ముందు తరాలకు అయినా మార్గం చూపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
మీగడ త్రినాధ రావు
Friday, 12 April 2013
పాలకులు ప్రజలు పరిపాలన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment