Pages

Friday, 12 April 2013

మహా నటుడి మనో వేదన -Greatandhra Article

మహా నటుడి మనో వేదన

ఒక మహా నటుడిని  ఇంతలా రాజకీయాలు చేసి ఏడిపించటం ఆ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అంత శ్రేయస్కరం కాదు . శ్రీ శ్రీ గారు చెప్పినట్లు , "అగ్గి పుల్ల సబ్బు బిల్లా కుక్క పిల్ల కాదేది కవితకనర్హం " అలాగే , కులం , మతం , వర్గం కావేవి సినిమాకి రాజకీయలకి అనర్హం . చెట్టు పేరు చెప్పి కాయలు  అమ్ముకున్నట్లు , వీటిని అడ్డం పెట్టుకొని కొంత మంది ప్రముఖులు రాజకీయాలు చేస్తున్నారు .

ఇంకా మన సెన్సార్ బోర్డు దేనికి? ప్రతి సినిమా కోర్టులోనే సెన్సార్ చేస్తే సరిపోతుంది కదా . అయితే సెన్సార్ బోర్డు అయినా తప్పుడు ధ్రువ పత్రం జారి చేసి వుండాలి లేకపొతే రాజకీయం అయినా జరిగివుండాలి . సినిమా విడుదల అవ్వటం భయం . టైటిల్ దగ్గరనుండి అన్ని వివాదాలే . సినిమా అన్నాక అన్ని రకాల పాత్రలు వుంటాయి , అన్ని విషయాల మీద వుంటాయి . ఉగ్రవాదం మీద ఇదివరకే కొన్ని వందల సినిమాలు వచ్చివుంటాయి . మరి అప్పుడు లేని రాద్దాంతం ఇప్పుడు దేనికి ? "పుచ్చ కాయలు దొంగా అంటే బుజాలు తడుముకున్నట్లు వుంది ". పాత్ర అన్నాక ఒక మనిషి వుండాలి వాడు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అంత మాత్రానికే బుజాలు తడుముకుంటే ఎలా ? అసలు విషయం అంతర్జాతీయ ఉగ్రవాదం . మరి అంతర్జాతీయ ఉగ్రవాదానికి నాంది పలికిన దేశాలు యేవో వారికి తెలియదా? మరి కరుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదులు , మట్టికొట్టుకుపోయిన ఉగ్రవాదులు ఎవరు? ఏ దేశాలాకి సంబందంచిన వారు? వారి మూలాలు ఈ మతం నుండి వచ్చాయి? మత బోదనలు పేరిట ఉగ్రవాద శిక్షణనిస్తున్న ఉదంతాలు మన దేశంలో కోకొల్లు . మతాన్ని వక్రీకరించి దానికి వేరే భాష్యం చెప్పి యువతను పెడ త్రోవ పట్టిస్తున్న ఉదంతాలు ఎన్ని లేవు? వాటిని వారు కాదనగలరా? మన దేశంలో భావ ప్రకటన హక్కు రాజ్యాంగం ఇచ్చింది . దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు . కోర్టులకెక్కి , రచ్చ చేసి రాజకీయ రంగుపులిమి సదరు నటుల్ని నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టి ఏడిపించటం ఎంతవరకు సబబో రాజకీయ పావులుగా మారిన ఆ కుల మత  పెద్దలే ఆలోచించాలి . సాక్షాత్తు దేశం హొమ్ మంత్రి వర్యులే కలగ జేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణం ? ఆ మహా నటుడు  ఆ మహా తల్లి ఆడుతున్న రాజకీయ ఎత్తుగడతో ఖిన్నుడై "నేను దేశం విడిచి పోతాను " అన్నంతవరకు పరిస్థితి వచ్చింది అంటే మనం సిగ్గుతో తల దించుకోవాలి.

యముడు కూడా హిందూ ధర్మం లో ఒక దేవుడే , మరి ఆ యముడి మీద ఎన్ని సినిమాలు రాలేదు? చివరకు వారికీ తోచిన విధంగా హిందూ దేవతలను చిత్రిస్తుంటే అవన్నీ కుల రాజీయం చేసే ఆసాములకు  తప్పులుగా అనిపించవు . ఒక్క కులం పేరు, మతం పేరు ఎత్తితే చాలు ఎక్కడలేని పౌరుషం పుట్టుకొస్తుంది . కులం కార్డు పెట్టుకొని , మతం కార్డు పెట్టుకొని వారి అస్తిత్వాన్ని చాటుకోవాలని ప్రయిత్నించి రాజకీయ రంగులు పులిమితే  ఇంకా కోట్లు ఖర్చు పెట్టి , ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని , సర్వసం పొగుట్టుకొని సినిమాలు తీస్తున్న నిర్మాతల పరిస్థితేంటి?   సెన్సార్ క్లీన్ చిట్ ఇచ్చిన సినిమాలు కూడా విడుదల చేయలేక కోర్టుల చుట్టూ తిరిగే కంటే  దేశం విడిచి పెట్టి అక్కడ సినిమాలు తీసుకుంటే మంచిది అనిపించక మానదు .

అయితే సెన్సార్ బోర్డుని అయినా రద్దు చేసి ప్రతి సినిమా కోర్టులోనే  సెన్సార్ చేయ్యనైనా చెయ్యాలి లేకపొతే ఇలాంటి రాజకీయాలకైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతయినా వుంది

                             
                                                                                                                           మీగడ త్రినాధ రావు                                                                                                                                                                  
                                                                                                                                                trinadh.meegada@gmail.com

No comments:

Post a Comment