వారు ఎందులో తక్కువ ?
భారత స్వతంత్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు వారి జీవితాల్ని తృణప్రాయంగా అర్పించారు. వారిలో గోపాల కృష్ణ గోకలే , బాల గంగాధర్ తిలక్ , మహాత్మా గాంధీ , జవహర్ లాల్ నెహ్రు మున్నగు వంటివారే కాకుండా వారితో సమానంగా అతివాదులుగా ముద్ర వేయబడ్డ నేతాజీ శుభాష్ చంద్రబోసు , మన అల్లూరి సీతారామ రాజు , భగత్ సింగ్ మొదలగు ఎందరో మహనీయులు అశువులు బాసారు. ఏ ఒక్కరి వలనో మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం రాలేదని మనం గుర్తించాలి . కాని ప్రభుత్వాలు గౌరవం ఇవ్వటంలో అతివాదులుగా ముద్ర పడ్డ వారి పట్ల మొదటినుండి వివక్ష చూపిస్తున్నాయనేది అవగతమౌతుంది. కేవలం సైద్ధాంతిక భేదాలు తప్పించి ఇరువర్గాలవారు స్వాతంత్ర్యం కోసమే తమ జీవితాల్ని అర్పించారు . "భారత రత్న" వంటి అత్యుత్తమ పురస్కారాలను ఇంతవరకు శుభాష్ చంద్రబోసు వంటి మహనీయులకి ఇవ్వకపోవటం అనేది కడు శోచనీయం . నేతాజీ చివరి రోజులు అతి దుర్బరంగా నైజీరియా జైల్లో గడిచాయని , కనీస సౌకర్యాలు కూడా లేని "నైజీరియా జైళ్ళ గోడల మద్య మతిస్థిమితం కూడా కోల్పోయి దిక్కులేని పరిస్థితిల్లో మగ్గారు" అని తెలియజేసే వాస్తవాలు ఈ మధ్యే మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి . ఆనాటి భారత ప్రభుత్వం నేతాజీ జాడ తెలిసినా కూడా భారత్ కి తీసుకురావటంలో కనీస ప్రయత్నాలు చెయ్యలేదన్న ఆరోపణలు కూడా వున్నాయి . మొన్నటివరకు నేతాజీ ఒక విమాన ప్రమాదంలో చనిపోయారని నమ్మ పలికాయి ప్రభుత్వాలు . "పద్మ" పురష్కారలతో పాటు ఎంతో మందికి "భారత రత్న" వంటి అత్యుత్తమ భిరుదులు పైరవీలు కు లోబడి ఇచ్చినట్లుగా కూడా విమర్శలు వున్నాయి. గత మూడు దశాబ్దాలలో ఇచ్చిన వారితో పోలిస్తే మరి నేతాజీ , అల్లూరి, భగత్ సింగ్ లాంటి మహనీయులు ఎందులో వారికి తక్కువ అని పాలకులు గుర్తించాలి. ఈ దశగా ప్రజలు , కమిటీలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వత్తిడి తేవాల్సిన అవసరం ఎంతయినా వుంది . అదే మనం వారికి ఇచ్చే నిజమయిన నివాళి .
జై హింద్
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి

No comments:
Post a Comment