Pages

Friday, 12 April 2013

ఎవరికి చెప్పాలి?- Greatandhra article

ఎవరికి చెప్పాలి?

పురిటి నొప్పుల ప్రయాసతో పెనుగులాడి
ఈ జన్మనిచ్చిన అమ్మకి చెప్పనా?
ప్రేమికుల రోజు శుభాకాంక్షలూ ......
సర్వశక్తులు ధారపోసిన నాన్నకి చెప్పనా?
గొంతుచించుకొని ఈ బ్రుతుకు ఇచ్చిన
నా గురువుకు చెప్పనా?
ప్రేమ స్వరూపం పరమాత్మకు చెప్పనా ?
నాకోసం బలి పశువైన అక్కకి చెప్పనా?
ఆసరా ఇచ్చిన అన్నకి చెప్పనా ?
చెలిమికి ప్రాణంలా...... నిలిచే నిచ్చెనలా .
నన్నాదుకున్న నా మిత్రుడికి చెప్పనా?
తన అందచందాల ఆదరణతో అబ్బురపరిచిన
చిన్ననాటి నా చిరు చెలిమికి చెప్పనా?
కలిమి లేముల్లో.. కష్ట సుఖాల్లో
నా తనువులో తనువై మనసున మనసైన
అర్దాంగికి చెప్పనా ప్రేమికుల రోజు శుభాకాంక్షలూ
నా నా ప్రేమకు ప్రతిరూపమైన నా చిట్టి
తల్లి తండ్రికి చెప్పనా?ఎవరికి చెప్పను?
అమ్మా కొడుకుల ప్రేమ
తండ్రి తనయల  ప్రేమ
ప్రేమి 'కుల'  ప్రేమ, భార్యా భర్తల ప్రేమ
మనిషి మనిషికో ప్రేమ మరో కావ్యం ఈ ప్రేమ
స్నేహ సన్నిదే ఈ  ప్రేమ స్నేహ వీచికే ఈ ప్రేమ
క్షణ క్షణం పంచబూతాల సరసన నిలిచి
మానవత్వ మారు పేరుతో 
ప్రేమనిస్తున్న ప్రేమ.. ప్రేమిస్తున్న ప్రేమ ..
ప్రేమే సత్యం ప్రేమే నిత్యం అన్న తత్వంతో
ప్రేమ వుంది నిత్యం అదే ఈ జీవిత సత్యం

                      మీగడ త్రినాధ రావు
                 మన తెలుగు మన సంస్కృతి

No comments:

Post a Comment