తెలుగోడి గోడు
ఈ రోజు అంతర్జాతీతియ మాతృబాషా దినోత్సవం , మన మాతృ భాష గొప్పతనం తెలియజేసే దినం. " ఊరందరిది ఒక దారి ఉలిపిరి పిట్టది ఒక దారి" అని ప్రపంచం చాలా ముందుకు పోతుంటే తెలుగో తెలుగో అని ఇంకా ప్రాకులాడుతున్నరెంటి అని నా లాంటి భాషాభిమానుల్ని చూసి కొంతమంది మనసులోనే హేళనగా నవ్వుకోవచ్చుగాక! వాళ్ళ విషయంలో "నవ్విపోదురుగాక నాకేం సిగ్గు" అని నేను అనుకోక తప్పదు . కాని కొన్ని సంవత్సరాలు పోయాక ప్రపంచం వాళ్ళని చూసి నవ్వుతుంది అది వేరే విషయం . మన రాష్ట్రంలో వుండే దౌర్భాగ్యం అసలు ప్రపంచంలోనే మరెక్కడా ఉండదని నా భావన దీనికి కారణం అమితమైన పరభాషా మోజు, అభద్రతా భావం , ఒకర్ని చూసి ఒకరి అనుకరణ , ప్రభుత్వాల చిత్తశుద్ది లేమి , ఉదాశీన వైఖరి మొదలగునవి .
మిగతా విషయాలు పక్కన పెడితే ప్రస్తుత మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుగు భాష పట్ల వారి అంకిత భావాన్ని కొద్దో గొప్పో చాటుతున్నారనే మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటె వెయ్యి అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలౌతుంది కాబట్టి వారి తీసుకుంటున్న నిర్ణయాలు చేపట్టిన కార్యక్రమాలుకు మరింత చిత్తశుద్ది ప్రభుత్వ యంత్రాంగం రూపంలో తోడైతే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుందనే చెప్పాలి . ఈ సందర్భంగా అధికార భాషా సంఘ అద్యక్షులు బుద్ద ప్రసాద్ గారిని కూడా అభినందించాలి. అలా అని ఇదివరకటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేదా అంటే తీసుకున్నాయి ఎటొచ్చి ఆచరణ లోపమే. మొన్న ప్రపంచ మహాసభలు నిర్వహించినప్పుడు కొంతమంది ప్రాంతీయ వాదానికి , కొంతమంది కుల రాజకీయానికి ముడి పెట్టి తలా ఒక రాయి విసిరి బురద చల్లె ప్రయత్నం చేసారు . కొన్ని నిర్వహణా లోపాలు విషయంలో కూడా చెరో రాయి విసిరారు .
నిర్వాహణ లోపం వాస్తవమే అయినా ప్రయత్నం అనేది చాలా గొప్పది అది ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. నిర్వహణ లోపాలు ఉంటూనే వుంటాయి కాని ఇటువంటి కార్యక్రమాల మూలంగా ఎంతో కొంత భాష పట్ల సమాజంలో ఉన్న స్థబ్దత కొంత వీడి భాష మీద ద్రుష్టి పెట్టటం అనేది జరుగుతుంది . కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు అవన్నీ అమలు కావాలంటే కొంత సమయం వేచి చూడక తప్పదు . ముఖ్యంగా ప్రభుత్వ,ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాచకాన్ని తప్పని సరి చేయటం అన్నది హర్షించదగ్గ విషయం. ఈ ప్రతిపాదన ఇదివరకు వున్నా సరే ఎటొచ్చి అమలు కాలేదు . ఇప్పటి కూడా అమలు చేయటం మీద కొన్ని అపనమ్మకాలు వున్నాయి . వాటిని కూడా అధిగమిస్తే భాష బట్టకడుతుంది ఇప్పటికే న్యాయ స్థానాల్లో తెలుగుకోసం కసరత్తులు జరుగుతున్నాయి . వాణిజ్య సంస్థలు వారి నామ సూచికలు తెలుగులోనే వుండాలని ప్రభుత్వ శాఖలు హుకుం జారిచేసాయి ఆ దిశగా అడుగులు వేసి చిన్న చిన్న వ్యాపార సంస్థలు వారి నామ సూచికలు తెలుగులోకి మారుస్తున్నారు కాని కొన్ని భడా సంస్థలు మాత్రం ఎంచక్కా సిగ్గు లేకుండా తెలుగు మచ్చుకైనా వారి నామ ఫలకాల మీద లేకుండా ఆంగ్లం లోనే కొనసాగిస్తూ వున్నాయి . ఇటువంటి వారి మీద కఠిన మైన వైఖరి ప్రభుత్వ యంత్రాంగం అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతయినా వుంది .
అంతేనా సినిమా వాళ్ళుకి కూడా వారి సినిమా పేర్ల కోసం ఇంత చక్కటి భాషలో పదాలు కరువయ్యాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది వీటి మీద కూడా ప్రభుత్వం ద్రుష్టి పెట్టి అవసరం అయితే తెలుగు లో పేర్లు పెట్టిన వారికి రాయితీలు కల్పించాలి . ఇంకా కొన్ని చానల్స్ అయితే తెలుగు అన్యాయమై పోతుందని కార్యక్రమాలు చేపడుతూ కూడా వారి కార్యక్రమాల పేర్లు తెలుగులో పెట్టడం లేదు ఈ విషయంలో ఈ టీవీ పత్రికను కాని చానల్స్ ని కాని మినహాయించవచ్చు .
ఇవన్ని ఒక ఎత్తయితే ప్రజల్లో మాతృ భాష పట్ల మమకారం అనేది కలగాలి. కాని ఈ రోజు బయట పరిస్థితి చాలా అద్వాన్నంగా వుంది గ్రామీణ సంస్కృతిలో కూడా పరభాషా వ్యామోహం పెరుగుతుంది . కూలి చేసుకొనే వారినుండి కలెక్టర్ వరకు "నాన్న" బదులు "డాడీ" అని "అమ్మ" అనే పిలుపు బదులు "మమ్మీ" అని పిలిపించు కోవటానికే మక్కువ చూపిస్తున్నారు. ఇక్కడ కూలిచేసుకొనే వారంటే చిన్న చూపు మాత్రం కాదు వారి వాదన కూడా ఇంకోలా వుంటుంది అందరూ మమ్మీ డాడి అయితే మేమేనా తక్కువ అని వాదిస్తారు తప్పువారిది కాదు సమాజానికి ఒక దారి చూపించాల్సిన విద్యావంతులే (పాఠశాలల్లో ఉపాద్యాలుకుగా పనిచేస్తున్న వారితో కలుపుకొని ) భాషను చిన్న చూపు చూస్తున్నారు మరి వారిని అనుకరిస్తున్న సామాన్యుడు కూడా తీవ్ర అభద్రతా భావానికి లోనై "మమ్మీ డాడి" సంస్కృతికి ప్రాణం పోస్తున్నాడు . కనుమరుగవబోతున్నకొన్ని ప్రపంచ భాషల్లో తెలుగు కూడా ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా కూడా మన వారిలో ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి .
జై తెలుగు జై జై తెలుగు
మీగడ త్రినాధరావు
మన తెలుగు మన సంస్కృతి

No comments:
Post a Comment