ఇది కాదా ?ఉల్లంఘన ?
'పోటా'లను పాతిపెట్టి ..
ఉగ్రవాదికోతమిచ్చి ఊయలూపి ..
మానిఫెస్టో మాయజేసి ..
ఓటు బ్యాంకు...ఒడుపు కోసం
స్విస్సు బ్యాంకు నీడ కోసం ..
అన్ని మీ బంకులే బలి పశువుల బాదలే
ఉరి తీసిన మరునాడు ఊగిపోయే
ఊసరవళ్ళు లారా...
మేదావి మూర్ఖులారా
ఇది కాదా ?ఉల్లంఘన ?
ఇది కాదా అమానుషం?
ఎవరికి కావలి? మీ సంతాపం
ఎవరికి కావలి? మీ సానుబూతి
ఎవరికి కావలి? మీ పరామర్శలు
ఎవరికి కావాలి ? మీ పలకరింపులు
మా అన్నను తెస్తుందా
మా తమ్ముని తెస్తుందా మీ సంతాపం
అమాయకులం అణగారిన అనేకులం
పోతున్నాం.. పోతున్నాం
అన్యాయం .. అయిపోతున్నాం
దులిపెయ్యి దులిపెయ్యి నీ చేతులు దులిపెయ్యి
కార్చేయ్యి కార్చేయ్యి నీ కన్నీటిని కార్చేయ్యి
ఇచ్చెయ్యి ఇచ్చెయ్యి 'యక్సుగ్రేసియా'
సిగ్గు లేని ఎగ్గు లేని పెద్దలారా
రండి రండి కదలి రండి
మా శవాలపై శయనించి..
మా పసుపు ముళ్ళు మీ పానుపుగా
మా కడుపు తీపి మీకు చక్కెరగా
చేసుకొని ..
రండి రండి పెద్దలారా నడిచిరండి
పీకలను పట్టుకెళ్ళి మొండేలను మనకిస్తే
పొంగ లేదా నీ రక్తం ? అబక లేదా నీ నెత్తురు
మేలుకో.. రా...? మా మేలు కో.. రి
మమ్ము'ఏలు' కో.. రా? ..మా మొరలు విని
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
'పోటా'లను పాతిపెట్టి ..
ఉగ్రవాదికోతమిచ్చి ఊయలూపి ..
మానిఫెస్టో మాయజేసి ..
ఓటు బ్యాంకు...ఒడుపు కోసం
స్విస్సు బ్యాంకు నీడ కోసం ..
అన్ని మీ బంకులే బలి పశువుల బాదలే
ఉరి తీసిన మరునాడు ఊగిపోయే
ఊసరవళ్ళు లారా...
మేదావి మూర్ఖులారా
ఇది కాదా ?ఉల్లంఘన ?
ఇది కాదా అమానుషం?
ఎవరికి కావలి? మీ సంతాపం
ఎవరికి కావలి? మీ సానుబూతి
ఎవరికి కావలి? మీ పరామర్శలు
ఎవరికి కావాలి ? మీ పలకరింపులు
మా అన్నను తెస్తుందా
మా తమ్ముని తెస్తుందా మీ సంతాపం
అమాయకులం అణగారిన అనేకులం
పోతున్నాం.. పోతున్నాం
అన్యాయం .. అయిపోతున్నాం
దులిపెయ్యి దులిపెయ్యి నీ చేతులు దులిపెయ్యి
కార్చేయ్యి కార్చేయ్యి నీ కన్నీటిని కార్చేయ్యి
ఇచ్చెయ్యి ఇచ్చెయ్యి 'యక్సుగ్రేసియా'
సిగ్గు లేని ఎగ్గు లేని పెద్దలారా
రండి రండి కదలి రండి
మా శవాలపై శయనించి..
మా పసుపు ముళ్ళు మీ పానుపుగా
మా కడుపు తీపి మీకు చక్కెరగా
చేసుకొని ..
రండి రండి పెద్దలారా నడిచిరండి
పీకలను పట్టుకెళ్ళి మొండేలను మనకిస్తే
పొంగ లేదా నీ రక్తం ? అబక లేదా నీ నెత్తురు
మేలుకో.. రా...? మా మేలు కో.. రి
మమ్ము'ఏలు' కో.. రా? ..మా మొరలు విని
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
No comments:
Post a Comment