Pages

Friday, 12 April 2013

సార్లు జరా ఆగుండ్రి http://telugu.greatandhra.com/politics/feb2013/bomblast_article_23.php

సార్లు జరా ఆగుండ్రి
http://telugu.greatandhra.com/politics/feb2013/bomblast_article_23.php

సార్లు జరా ఆగుండ్రి నేనెవ్వరో ఎరకనా ? నేనొక ఆత్మని.. కాదు ఒక జీవిని. నా శరీరం జూస్తే తునా తునాకలయ్యె ఎవరెవరో వస్తుండ్రు ఏమేమో జేస్తుండ్రు నా పిల్లగాడు, పోరి "నాయనో" "నాయనో" యని గుక్క పెట్టి  ఎడుస్తుండ్రు.  మా ఇంటామె భూదేవి మీదకు వంగి తల బాదుకొంటూ వుండే . ఏమో సార్లూ ఎమోయిందో ఏమో కూలి నాలిజేసి బతికేటోళ్ళం సారూ మయా మర్మం తెలియనోళ్ళం సారూ.  ఏ రోజు పైసల్ ఆరోజే ఖర్చు జేసి  గంజి నీళ్ళు తాగేటోళ్ళం ఏందో సారూ నా మాటలు మా పోరికి పిల్లగాడికి ఇంపిస్తాలేదు నా కడుపు సెర్వు లెక్క అయితన్ది.  నా పిల్లగాళ్ళని హత్తుకొని "ఫిఖర్ జెయ్యకుండ్రి బిడ్డా ...నేనున్నాగదా"  అని జెప్పలనిపిస్తుండే కాని నా మాటలు వాళ్ళకి ఇంపిస్తలేవు.

ఆ  రోజు కూలిజేసి దుకాణంలో చాయ్ తాగినా  నా పిల్లగాళ్ళకి పకోడీ కూడా కొన్న సారూ... ఇదిగో చూడున్డ్రి  ఇంకా నా చేతిలోనే వుండే , దుఖానం వానికి జర్రా తొందరగా కూడా గట్టామన్న సారూ . "ఎప్పుడు ఇంటికి పోతనా నా పిల్లగాల్లకి ఇస్తనా" అని నా మనసు పీకుతుండే సారూ కాని ఇంతలో పెద్ద శబ్దం అయ్యే  సారూ నిమషం గూడా లేకుండే మాంసం ముద్దలు పడినయ్ , జనం హా హా కారం జేసిండ్రు .

 సారూ నేను సచ్చిపోయినా అని ఏడస్తా ఉండ్రు మాయామె దుఖ్ఖం జూస్తే నా గుండె తరక్కపోతాంది సారూ... మా వాళ్ళందరూ అచ్చి నా యాలిబిడ్డల్ని ఊకోమంటుండ్రు ఇదిగో సారూ ..నా మాట మీకన్నా ఇన్పిస్తవున్దా జరా మా పిలగాల్లకి జెప్పుండ్రి నే వున్నా అని ..నేనే గాదు సారూ చాలా మంది నాతో వున్నరు ఆల్లు కూడా నా లెక్కనె అల్ల మాటలు కూడా మీకు ఇమ్పిస్తాలేవా ? ఆళ్ళ ఘోష కూడా మీకు ఇంపిస్తాలేదా? .

ఏమయ్యింది సార్లూ ఏమి తెల్వకుండే మేం ఎమ్జేసినం సారూ ఏం తప్పు జేసినం? మేమన్నా మంది సొమ్ము కోట్లు కోట్లు తిన్నమా  ? హత్యలు జేసినమా ? తలలు నరికినమా?  మనబంగం జేసినమా ? కుంబ కోణాల్ జేసినమా?  ఏం జేసినం సారూ?  ఏం తప్పు జేసినం సారూ . కుంబకోణం జేసేటోళ్ళు  మానబంగం జేసేటోళ్ళు సక్కగా వుండే గదా . మాకేంటి సారూ ఇంత పెద్ద సిచ్చ ఎసిండ్రు.

సారూ జరా అటు సూడుండ్రి మా పిల్లగాళ్ళు మా యామెను అడుగుతుండే " అమ్మా  నాయన ఏడకి పోయిండు మళ్ళి వస్తాడా"  అని.  మా యామె ఏం జెప్పకుండా గుండెలు బాదుకొంటూ వున్నది . మరి నా మాటలు వాళ్ళకి ఇంపిస్తలేవు సారూ నా మాట వినున్ద్రి . జర్రా నా మొండెం నా తలకి ఒకసారి అతికిన్చున్ద్రి నా కాళ్ళు సేతులు కూడా ఏడో తెగిపడినయ్ అవి లేకపోయినా పర్వలేద్  సారూ!  ఒక్కసారి నన్ను బతికిన్చున్ద్రి మా పిల్లగాన్ద్రకి  దైన్యం జెప్పి వొస్తా , కనీసం నా జేతిలో పకోడీ యన్నా దిన్పించి చివరిసారి హత్తుకొని అస్తా.  సారూ .. సారూ ..జర్రా వినుడ్రి ..నా ఆత్మా ఘోష మీకు ఇన్పిస్తున్దా సారూ ...
మీరు పైసల్ ఆరు లచ్చలు ఇట్టరంట గద సారూ బాగుంది సారూ బాగుంది మీ పైసల్ నా పిలగాల్లకి వాళ్ళ నాయన్నిస్తద వొద్దు సారూ వొద్దు మై పైసల్ మీ దగ్గరే పెట్టున్డ్రి మాకేమి వొద్దు సారూ  నా తలకి నా మొండెం దెచ్చి జర్ర్ర అతికించి ప్రాణం పోయున్డ్రి గంతే ..గంతే చాలు సారూ  ముష్టి ఎత్తి  అయినా నా పిలగాళ్ళను సాకుతా . సారూ ..సారూ ..జరా వినుడ్రి ..జర్రా వినుడ్రి ..సారూ ..........................


(ఇలా క్షోభిస్తున్న ఆత్మలెన్నో,  వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలి వాళ్ళ కుటుంబాలకి భగవంతుడి దయ వుండాలని కోరుకొంటూ , ఇకనైనా మన నాయకులూ మొద్దునిద్ర వీడుతారని కోరుకొంటూ )

మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి

No comments:

Post a Comment