Pages

Monday 29 April 2013

చట్టాలు మీ చుట్టాలు .. Greatandhra



చట్టాలు మీ చుట్టాలు ..
అన్ని మీకోసమే పుడతాయి మీకోసమే మారుతాయి 
ముస్కరులు మారణకాండ చేస్తే తప్ప
మీకు దేశ రక్షణ చట్టాలు గుర్తు రావు .
రాజదాని నడిబొడ్డున అదీ .. మీ ఇలాఖలో  .
కుక్కల కొడుకులు .ఖూనీకోరులు.
కామందులు కర్కశంగా కాలుదువ్వితె 
మీ కళ్ళు మూసుకు పోయాయి 
ఇదేమని ప్రశ్నించినోడికి ఇత్తడి మోతలు .ఇనప దెబ్బలు
కర్కశ కుక్కల ..కొడుకులకేమో కవచాలు
ఇదా ? ఇటాలియన్ అధినేత్రి రాజ్యం  ? ..
కాదు ఇది సుస్థిర శూన్య ప్రభుత్వం  
పేరు  పెద్ద ఊరు మాత్రం దిబ్బ...
మొన్నటివరకు ప్రతిభే  ప్రదమ నేత్రి 
మీరా..? సభాపతులు ..దీక్ష గల దీక్షిత్ లు ..
జయాలు అపజయాలు .మాయలు మరాటీలు
స్వరాజ్య సుష్మలు సురాజ్య సబితలు
అందరూ అందరే ..ఎన్నో ఆసిడ్ దాడులు
ఎన్నో కుక్కల కొడుకుల క్రురత్వాలు ..
మీ పిల్లలు మాత్రం భద్రం పొలిసు పహారాలో
మీకు రోడ్డు ప్రమాదాలు జరిగితే ..కానీ
నూట ఎనిమిది తీరు తెలిసేది ..
మీరు  పడితేనే అది బాద 
పరాయోడిది మాత్రం అది గాద ..
దేశం ముందుకు పోతుంది పోతుంది అంటారు
అవును పోతూ..నే .వుంది
ముప్పది రూపాయల గరిబోడు.మీకళ్ళకు అమీరోడు
మీ కళ్ళు కుళ్ళిపోయాయి ....
వాటికి   దర్పణాలు ద్రుష్టి కలిగించలేవు
మీ ఇలాఖానే పేల్చి నోళ్ళు  ..
కర్కశ క్రూర మృగాలు మీకు కొత్త అల్లుళ్ళు
మీకు ఓటేసి గెల్పించినోళ్ళు వెంగలప్పలు
ఇకనైనా మార్చండి మన మూర్కపు చట్టాల్ని
ఆ ఆడ కూతురు ఆయువు పోక ముందే 
మార్చండి మన మాసిపోయిన చట్టాల్ని
నిలబెట్టండి  నలిగిపోయిన న్యాయ దేవతని .

                             మీగడ త్రినాధ రావు
                      మన తెలుగు మన సంస్కృతి



No comments:

Post a Comment