దామిని
జరగాలి మీకూ ఏదో ఒక దారుణం
తెలుస్తుంది సామాన్యుల ఆర్తనాదం
కాదిది ఒక్క దామిని హరణం
రోజూ జరుగుతున్న దారుణం
మారని పాలకుల వైనం
అవుతుంది కంత్రీ నాయాళ్ళ కిరాతకం
తీరదు మనకీ మనస్థాపం
అవుతుంది ప్రతి సారీ చేదు నిజం
మారాలి తల్లి దండ్రుల దృక్పదం
వీడాలి పర సంస్కృతి వ్యామోహం
కాదిది ఒకరి తప్పు
సమాజానికే అవుతుంది ఒక ముప్పు
నేరమంటే నేర్పరితనం ...
కారాగారమంటే విహారం
జైలుకేలితే చాలు వాడు హీరో
వాడికి దండేసి నోడు మాత్రం జీరో
వెన్నులో వణుకు లేదు
శిక్షంటే భయం లేదు
బలిసినోడిదే బైలు ..అరిసినోడికి మాత్రం జైలు
చట్టం వారి ఎత్తు న్యాయం వారి సొత్తు
అవుతుంది న్యాయ దేవత చిత్తు
ఆగని క్రూర మృగాల క్రూరత్వం
అవుతుంది ఎందరో దామినుల దహనం
దేశానికే ఒక శాపం ఎందరో దామినుల ఆర్తనాదం
...మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
జరగాలి మీకూ ఏదో ఒక దారుణం
తెలుస్తుంది సామాన్యుల ఆర్తనాదం
కాదిది ఒక్క దామిని హరణం
రోజూ జరుగుతున్న దారుణం
మారని పాలకుల వైనం
అవుతుంది కంత్రీ నాయాళ్ళ కిరాతకం
తీరదు మనకీ మనస్థాపం
అవుతుంది ప్రతి సారీ చేదు నిజం
మారాలి తల్లి దండ్రుల దృక్పదం
వీడాలి పర సంస్కృతి వ్యామోహం
కాదిది ఒకరి తప్పు
సమాజానికే అవుతుంది ఒక ముప్పు
నేరమంటే నేర్పరితనం ...
కారాగారమంటే విహారం
జైలుకేలితే చాలు వాడు హీరో
వాడికి దండేసి నోడు మాత్రం జీరో
వెన్నులో వణుకు లేదు
శిక్షంటే భయం లేదు
బలిసినోడిదే బైలు ..అరిసినోడికి మాత్రం జైలు
చట్టం వారి ఎత్తు న్యాయం వారి సొత్తు
అవుతుంది న్యాయ దేవత చిత్తు
ఆగని క్రూర మృగాల క్రూరత్వం
అవుతుంది ఎందరో దామినుల దహనం
దేశానికే ఒక శాపం ఎందరో దామినుల ఆర్తనాదం
...మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
No comments:
Post a Comment